facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ పేల్చిన అణుబాంబ్

11-02-201911-02-2019 14:03:49 IST
2019-02-11T08:33:49.585Z11-02-2019 2019-02-11T08:33:46.719Z - - 17-02-2019

లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ పేల్చిన అణుబాంబ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే... అది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’! చరిత్రను వక్రీకరించకుండా... ఉన్నది ఉన్నట్లుగానే నిజాల్ని వెండితెరపై చూపించే దమ్ము ఒక్క రాంగోపాల్ వర్మకే ఉంది కాబట్టి... ఈ సినిమాను ఎలా చిత్రీకరించాడోనని ఉత్కంఠ నెలకొంది. దీన్ని అంతకంతకు పెంచుతూ... వర్మ వరుస ట్విస్టులు ఇస్తూనే ఉన్నాడు.

లక్ష్మీపార్వతి కోణంలో నుంచి రూపొందుతున్న ఈ చిత్రంలో... చంద్రబాబు వెన్నుపోటు అంశాన్నే హైలైట్ చేస్తున్నట్లు ఇదివరకే వర్మ ఓపెన్‌గా చెప్పేశాడు. అది ఏ రేంజ్‌లో ఉంటుందో రెండు పాటల ద్వారా బహిర్గతం చేశాడు కూడా! దీంతో... ఇందులో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుందని అర్థమైపోయింది. ఇటీవల ఆ సన్నివేశాల్ని చిత్రీకరించడంతో... ఆ విషయం కన్ఫమ్ అయ్యింది. వైస్రాయ్ హోటల్‌ను తలపించే ఓ భవంతిలో ఈ మొత్తం ఎపిసోడ్‌ను షూట్ చేసినట్లు తెలిసింది. దాంతోపాటు... ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన సంఘటనల్ని కూడా వర్మ ఈ చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్‌గా ఈ చిత్రం గురించి మరో బాంబ్‌లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. కేవలం చంద్రబాబునే కాకుండా... మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీనే వర్మ టార్గెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు ఎలా వ్యవహరించారన్న విషయాలతోపాటు చోటు చేసుకున్న పరిణామాల్ని వర్మ బలంగా చెప్పబోతున్నట్లు సమాచారం! ముఖ్యంగా... హరికృష్ణ, బాలయ్యను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇదే నిజమైతే... ఇందులో డ్రామా బాగా పండటం ఖాయం!

Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle