newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

రేణుకి సర్ ప్రైజ్.. పిల్లలకోసం పవన్ ఏంచేశాడంటే?

14-02-202014-02-2020 09:20:07 IST
Updated On 14-02-2020 13:46:55 ISTUpdated On 14-02-20202020-02-14T03:50:07.463Z14-02-2020 2020-02-14T03:49:47.968Z - 2020-02-14T08:16:55.420Z - 14-02-2020

రేణుకి సర్ ప్రైజ్.. పిల్లలకోసం పవన్ ఏంచేశాడంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్‌తో పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. లాయర్ సాబ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మే నెలలో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు పవన్. వీటితో పాటు మరో ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నారు. సినిమాలతో బిజీగా వున్న పవన్ కొన్ని విషయాల్లో మాత్రం తన బాధ్యత మరిచిపోవడం లేదని తెలుస్తోంది. 

తన మాజీ భార్య రేణు దేశాయ్ విషయంలో పాజిటివ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పిల్లల కోసం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడని, ఖరీదైన గిఫ్ట్ ఒకటి రేణుకి ఇచ్చాడని అంటున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు పెట్టి ఓ ఇల్లు కొనిచ్చాడు.  పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రేణు కూడా హైదరాబాద్ లో ఉండేందుకు ఈ ఇల్లు దోహదపడుతుందని అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్ తో విడాకుల తరువాత రేణు దేశాయ్ పుణెకు వెళ్లిపోయింది. కొడుకు, కుమార్తెతో ఇన్ని రోజులు అక్కడే గడిపింది రేణు. అప్పుడప్పుడు పవన్ కూడా పిల్లల కోసం అక్కడికి వెళ్లి వచ్చేవారు. ఇక సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలనుకుంటోన్న రేణు.. హైదరాబాద్‌కు షిప్ట్ అవ్వాలని భావిస్తోంది.

పవన్, రేణు కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో రేణు కూడా పాజిటివ్ గా వుంది. పిల్లల గురించి ఆలోచించిన పవన్ ఇంటిని కొన్నాడని అంటున్నారు. అంతేకాదు ఈ ఇంటిలో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటుచేశాడు. మొత్తానికి తన మాజీ ప్రేయసికి పవన్ ఇస్తున్న వేలంటైన్స్ డే గిఫ్ట్ ఇదేనేమో. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle