రీ ఎంట్రీ ఇస్తోన్న లేడీ సూపర్ స్టార్.....
13-08-201913-08-2019 13:06:47 IST
Updated On 13-08-2019 14:31:39 ISTUpdated On 13-08-20192019-08-13T07:36:47.089Z13-08-2019 2019-08-13T07:36:31.803Z - 2019-08-13T09:01:39.472Z - 13-08-2019

డేరింగ్ అండ్ డాషింగ్..లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ పేరు తెరపైకి వచ్చింది. దీనికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించడమే. సూపర్ స్టార్ కృష్ణతో విజయశాంతి హీరోయిన్ గా నటించినప్పుడు మహేశ్ బాబు బాల నటుడిగా యాక్ట్ చేశాడు. ప్రస్తుతం మహేశ్ సూపర్ స్టార్ బిరుదుని కైవశం చేసుకుని స్టార్ నటుడిగా ఎదిగాడు. 13సంవత్సరాల అనంతరం విజయశాంతి..మహేశ్ బాబు చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి..వీరిద్దరికి స్టార్ బిరుదులు ఉన్నాయి.
తెలంగాణలోని వరంగల్ విజయశాంతి స్వస్థలం. జూన్ 24 1966లో జన్మించింది. 1979లో కల్లుక్కుళ్ ఈరమ్ అనే తమిళ చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. మొదటిసారిగా విజయశాంతిని తెరపై చూపింది తమిళ దర్శకుడు భారతీ రాజా. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో కిలాడి కృష్ణుడు చిత్రంతో తెలుగు సినిమాలో మెరిసింది. 1983లో టి. కృష్ణ దర్శకత్వంలో ఈతరం సంస్థ నిర్మించిన నేటి భారతం చిత్రంతో విజయశాంతికి గుర్తింపు వచ్చింది. నటిగా నిలదొక్కుకోవాడానికి ఈమెకి నాలుగు సంవత్సరాలు పట్టిందంటే నమ్మశక్యం కాదు. ఈమెకి సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. పాతతరం నటి విజయలలిత ఈమెకు పిన్ని.
విజయశాంతి అప్పట్లోని స్టార్ హీరోలందరితో ఆడి..పాడింది. హీరోలతో సమానంగా డ్యాన్సే కాదు..ఫైట్స్ ని చేసేది ఈ లేడీ అమితాబ్. విజయశాంతి ఎనర్జీని చూసి ఆమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా ఉండేవారు. అప్పట్లోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వచ్చాయి. 1990వ సంవత్సరంలో వచ్చిన కర్తవ్యం చిత్రం విజయశాంతిలోని నట విశ్వ రూపాన్ని బయటపెట్టింది. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అంతేకాదు ఏడు ఫిలిం ఫేర్ పురస్కారాలు..ఆరు ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారంతో పాటు నాలుగు రాష్ట్ర నంది అవార్డులను కైవశం చేసుకుంది. కేవలం తెలుగు..తమిళ చిత్రాలే కాకుండా కన్నడం..మలయాళం..హిందీ చిత్రాల్లోనూ నటించింది ఈ ఫైర్ బ్రాండ్. రాను..రాను హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది. ఆమె 30ఏళ్ల సినీ కెరియర్ లో 180చిత్రాలకు పైగా నటించింది.
సినీ అవకాశాలు కనుమరుగవుతున్న కొద్దీ ఈమె రాజకీయాలపై దృష్టి సారించింది. 1998వ సంవత్సరంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీతో విజయశాంతి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ పార్టీలో ఇమడలేక బయటికి వచ్చి సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. కొద్ది రోజులు సొంత పార్టీని నడిపించిన తరువాత టి ఆర్ ఎస్ పార్టీలోకి చేరి గులాబి కండువా కప్పుకుంది. అసలే ఫైర్ బ్రాండ్ మరి తనని నిర్లక్ష్యం చేస్తే సహిస్తుందా..అందుకే టి ఆర్ ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరింది. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉన్నారు.
మీడియాకి దూరంగా ఉంటూ..ఎటువంటి కాంట్రవర్శీలకు తన దరి చేరనీయలేదు విజయశాంతి. అంతేకాదు ఆమె ఫ్యామిలీ..వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమాలో రీ ఎంట్రీ ఇస్తుందంటే ఆమె పాత్ర ఎంత ఫవర్ ఫుల్లో అర్థమవుతుంది. ఎంతనా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కదా..చిన్నా..చితక పాత్ర అయితే అంగీకరించదు కదా. మరి ఈ చిత్రంతో మరిన్ని సినిమాలు చేస్తుందా..లేదా అనే ప్రశ్నకి ఈ రాములమ్మే సమాధానం చెప్పాలి.

"అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" సినిమా రివ్యూ
11 hours ago

మరో మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్..
12 hours ago

గొల్లపూడి మృతిపై ఎవరెవరు ఏమన్నారంటే..
12 hours ago

'మమాంగం'..మూవీ రివ్యూ
12 hours ago

గొల్లపూడి మృతికి టాలీవుడ్ దిగ్భ్రాంతి
15 hours ago

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత.. పలువురి నివాళి
15 hours ago

అశ్వనీ దత్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చిరంజీవి
20 hours ago

'వెంకీ మామ'..ప్రీ రిలీజ్ బిజినెస్
20 hours ago

బిగ్ బ్రేకింగ్.. వర్మ మూవీకి గ్రీన్ సిగ్నల్
11-12-2019

రాంగోపాల్ వర్మకు మళ్ళీ షాక్.. సినిమాకు బ్రేక్
11-12-2019
ఇంకా