newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రియా సోదరుడు శౌవిక్ చక్రవర్తి అరెస్ట్.. త్వరలో రియా కూడా అరెస్ట్!

05-09-202005-09-2020 10:29:20 IST
Updated On 05-09-2020 10:47:06 ISTUpdated On 05-09-20202020-09-05T04:59:20.092Z05-09-2020 2020-09-05T04:59:17.184Z - 2020-09-05T05:17:06.515Z - 05-09-2020

రియా సోదరుడు శౌవిక్ చక్రవర్తి అరెస్ట్.. త్వరలో రియా కూడా అరెస్ట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో శామ్యూల్ మిరాండాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియాను, ఆమె తండ్రిని కూడా సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఎన్‌సీబీ అధికారులు కూడా ప్రశ్నించారు. 

జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో రియాను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.  

రియా, షోవిక్‌ చక్రవర్తి ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంపై  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన ఎన్‌సీబీ.. శుక్రవారం ఉదయం ముంబైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది. అదే విధంగా మరో బృందం సుశాంత్‌ హౌజ్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా ఇంట్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. 

ఎన్‌డీపీఎస్‌ చట్టం, విధివిధానాలను అనుసరించి ఈ మేరకు రియా, మిరండా నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు.  కాగా డ్రగ్‌ డీలర్‌తో రియా చక్రవర్తి సంభాషణ జరిపినట్లుగా ఉన్న వాట్సాప్‌ చాట్‌ బహిర్గతమైన సంగతి తెలిసిందే. తద్వారా ఆమె నిషేధిత డ్రగ్స్‌ గురించి తన సన్నిహితులతో చర్చించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్‌సీబీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. 

ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, శామ్యూల్‌ మిరండాలకు డ్రగ్స్‌ అందించినట్లుగా అనుమానిస్తున్న అబ్దుల్ బాసిత్, జైద్‌ విల్తారా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కాగా సుశాంత్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తి మార్చి 17న జైద్‌ ఫోన్‌ నంబరును సుశాంత్‌ మేనేజర్‌ మిరాండాకు షేర్‌ చేసినట్లు చాట్స్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో 10 వేల రూపాయల విలువ గల 5 కిలోల డ్రగ్స్‌ను కొనుగోలు చేసినందుకు జైద్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా షోవిక్‌ కోరాడు.

ఈ కొనుగోలులో భాగంగా మిరండా జైద్‌కు మూడుసార్లు కాల్‌ చేసినట్లు వెల్లడైంది. భాసిత్‌ ద్వారా జైద్ నంబర్‌ వీరికి తెలిసినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ ఎదుట హాజరైన అతడి మేనేజర్‌ శృతి మోదీ సుశాంత్‌, రియా కలిసి గంజాయి తాగేవారని వెల్లడించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు షోవిక్‌, మిరండా టెర్రస్‌ మీద గంజాయి పీల్చేవారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము మీడియాకు ఎటువంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

 

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

ఆర్ఆర్ఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే.. అద్భుతం.. అంతే..

   35 minutes ago


హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

హిందీలో అల.. వైకుంటపురములో.. హీరో ఎవరంటే..

   an hour ago


ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

ది ఫ్యామిలీ మ్యాన్ 2.. అన్నింట్లోనూ రికార్డులే..

   8 hours ago


పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

పవర్ స్టార్ చిత్రం లో హీరోయిన్ గా తాను నటించడం లేదు.

   13-06-2021


విజయ్ దేవరకొండ తన  ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

విజయ్ దేవరకొండ తన ఓటీటీ అరంగేట్రం కోసం పెద్ద ప్లానే వేస్తున్నాడు

   13-06-2021


దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

దీపికా పదుకొనే బ్యాగ్‌ చూసి రూ .2.45 లక్షలు పెట్టి బ్యాగ్ కొన్న అనన్య పాండే

   12-06-2021


రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

రవితేజ సినిమా ప్రారంభానికి ముందే ఇన్ని వార్తలా..?

   12-06-2021


ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మరో భారీ చిత్రం

   12-06-2021


ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ లో రాశి ఖన్నా

   11-06-2021


వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..

   11-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle