newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? గౌరవ్ ఆర్యా గుట్టురట్టవుతుందా?

31-08-202031-08-2020 16:53:53 IST
Updated On 01-09-2020 12:25:06 ISTUpdated On 01-09-20202020-08-31T11:23:53.142Z31-08-2020 2020-08-31T11:23:18.583Z - 2020-09-01T06:55:06.481Z - 01-09-2020

రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? గౌరవ్ ఆర్యా గుట్టురట్టవుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుశాంత్ కేసులో ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. సీబీఐ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ కేసులో కీలక విషయాలు రాబట్టే దిశగా ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా నిందితురాలు రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్‌లో బయటపడిన గోవాకు చెందిన గౌరవ్‌ ఆర్యాను విచారించేందుకు సిద్ధమయ్యారు.

సుశాంత్‌ మృతి కేసుతోపాటు మనీ లాండరింగ్‌, డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి గౌరవ్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీయనున్నారు. రియా-గౌరవ్ ఆర్యాలు సుశాంత్ విషయంలో ఏం చేశారనేది తేల్చనున్నారు. 

ఈ నేపథ్యంలో ముంబైలోని ఈడీ ఆఫీసుకు గౌరవ్‌ ఆర్య ఆదివారమే చేరుకున్నారు. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ వివిధ ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. ఇదిలా వుంటే సుశాంత్‌ సింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్‌తో ఎటువంటి పరియచం లేదని, ఎప్పుడూ అతన్ని చూడలేదని చెప్పాడు. రియాను 2017లో కలుసుకున్నాని వెల్లడించాడు. గోవాలోని తమరైండ్‌ హొటల్‌ అండ్‌ కేఫ్‌ కొటింగాని అతను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈడీ విచారణ అనంతరం, సీబీఐ, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆర్యాను విచారించనున్నారు. ఇక రియా చక్రవర్తి కూడా సీబీఐ అధికారుల ఎదుట సోమవారం ఉదయం హాజరయ్యారు.

సుశాంత్ మరణం తర్వాతే  బాలీవుడ్‌ డ్రగ్స్ కోణం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన కామెంట్ల వల్ల ప్రాణహాని కలుగుతుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు రక్షణ కల్పించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రేకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కంగ‌నా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలిసిన ఓ ప్రముఖ హీరో డ్ర‌గ్స్ వాడేవాడ‌ని ఆమె తెలిపింది.  తాను గురువుగా భావించే ఓ ద‌ర్శ‌కుడు కూడా తనకు డ్ర‌గ్స్ రుచి చూపించాడని, బాలీవుడ్‌లో దాదాపు 99 శాతం మంది డ్ర‌గ్స్ తీసుకుంటారని కంగనా చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. 

 

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   8 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   9 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   21 hours ago


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   a day ago


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle