newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

రావణుడిగా మారనున్న బాహుబలి..!

20-09-201920-09-2019 10:13:06 IST
Updated On 20-09-2019 16:17:19 ISTUpdated On 20-09-20192019-09-20T04:43:06.979Z20-09-2019 2019-09-20T04:27:07.693Z - 2019-09-20T10:47:19.641Z - 20-09-2019

రావణుడిగా మారనున్న బాహుబలి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అల్లు రామాయ‌ణం ప్ర‌స్తుతం తెలుగు, హిందీ చిత్ర సీమ‌ల్లో హాట్ టాపిక్. ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌ను వెచ్చించేందుకు బ‌ఢా నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, మ‌ధు మంథ‌న‌, న‌మిత్ మ‌ల్హోత్రా సంసిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి దంగ‌ల్ ఫేమ్ నితీశ్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి టాలీవుడ్ యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌పై ఓ రూమ‌ర్ సినీ జ‌నాల్లో తెగ‌ చ‌క్క‌ర్లు కొడుతోంది.

అయితే, బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్ దేశ వ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల వ‌చ్చిన ప్ర‌భాస్ సాహో మూవీకి నెగిటివ్ టాక్‌, రివ్యూలు వ‌చ్చినా క‌లెక్ష‌న్‌లు మాత్రం సూప‌ర్బ్ అనిపించాయి. సాహో సాధించిన వ‌సూళ్లు బాలీవుడ్‌ను సైతం ఔరా అనిపించాయి.

ఇదిలా ఉండ‌గా, ప్ర‌భాస్‌ను ఓ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పురాణ పాత్ర‌లో న‌టింపజేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది. రామాయ‌ణ క‌థ‌తో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ తెర‌కెక్కించ‌బోతున్న సినిమాల ప్ర‌భాస్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని బాలీవుడ్‌లో వినిపిస్తున్న స‌మాచారం.

రూ.600 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో మూడు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బ‌ల‌మైన రావ‌ణుడి పాత్ర‌కోసం చిత్ర బృందం ప్ర‌భాస్‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ ఈ సినిమాకు ఒకే చెప్ప‌లేద‌ని, ఆయ‌న టీమ్ ఈ ప్రాజెక్ట్‌ను టేకోవ‌ర్ చేయొచ్చా..?  లేదా..? అన్న‌ది బేరీజువేసే ప‌నిలో ఉంద‌న్న చ‌ర్చ‌లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

600 కోట్ల రూపాయ‌ల అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ప్ర‌భాస్‌కు ఉన్న దేశ‌వ్యాప్త స్టార్‌డ‌మ్‌తోపాటు హై ప‌ర్స‌నాల్టీ ప‌రంగా రావ‌ణుడి పాత్ర‌కు క‌చ్చితంగా స‌రిపోయే ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ఆయ‌న్ను రావ‌ణుడి పాత్ర కోసం తీసుకోవాల‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే, ప్ర‌భాస్ రావ‌ణుడి పాత్ర‌ను చేస్తే ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల్లో మ‌రింత హైప్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని, మ‌రోవైపు రాముడిగా హృతిక్ రోష‌న్, సీత‌గా దీపికాప‌దుకొనే న‌టించే అవ‌కాశం ఉండ‌టంతో వారికి ధీటుగా రావ‌ణుడి పాత్ర‌లో ప్ర‌భాస్ అల‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle