newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

21-05-202021-05-2020 11:59:56 IST
Updated On 21-05-2020 17:23:09 ISTUpdated On 21-05-20202020-05-21T06:29:56.142Z21-05-2020 2020-05-21T06:29:48.654Z - 2020-05-21T11:53:09.653Z - 21-05-2020

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి సందడే. తాజాగా రానా-మిహికా బజాజ్ ల ఎంగేజ్ మెంట్ వైభవంగా జరిగింది.  ఈవేడుకకు సంబంధించి రానా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. తన అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బ్యూటిఫుల్ ఫోటోలు విడుదలచేశాడు. రామానాయుడు స్టూడియోలో జరిగిన వేడుక అందరికీ సంతోషాన్నిచ్చింది. దగ్గుబాటి వారి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు పెళ్లి తర్వాత రానా పెళ్ళికొడుకు కాబోతున్నాడు. సంప్రదాయానికి పట్టుచీర కట్టినట్టున్న మిహిక అందం రానాను ఫిదా చేసినట్టుంది. ఎన్నడూలేనంత సంతోషంగా కనిపించాడు రానా. మరోవైపు రానా ఫోటోలపై కామెంట్ చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. మీరిద్దరికీ బిగ్ కంగ్రాట్యులేషన్స్.. చూడముచ్చటగా వున్నారంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు వరుణ్. 

కార్తికేయన్‌, సైనా నెహ్వాల్‌, అనసూయ.. ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. చూడముచ్చటైన జంట అని కితాబిచ్చారు. మీ జీవితం మరెంతో సంతోషంగా ఉండాలని  ట్వీట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రానా-మిహికా  కుటుంబాలు ఇప్పటికే కలిసి మాట్లాడుకున్నాయి. కొత్త జంట పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించుకున్నాయి.

రానా ప్రేమ వ్య‌వ‌హారం చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. రానా ఒక ఇంటివాడు కాబోతున్నాడ‌ని తెలిసిన వెంట‌నే ప్ర‌ముఖులంతా విషెస్ చెబుతున్నారు. కల్యాణం వస్తే ఆగదని పెద్దలంటారు. రానా తన ప్రేయసి గురించి తెలిపిన వెంటనే బంధువులు కూడా వీరిద్దరి పెళ్లికోసం తొందరపడుతున్నారు. రానా-మిహికల పెళ్లి త్వరలోనే వుంటుందని నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్రకటించారు.

ఇక బాబాయ్ వెంకటేష్ ఆనందానికి అవధులు లేవు. ఈమధ్య కూతురి పెళ్లి చేసిన వెంకటేష్ తమ ఇంట్లో మరో పెళ్ళి జరగబోతుండడంతో సంతోషంగా వున్నారు. అందులోనూ రానా తనకు కావల్సిన అమ్మాయిని తానే ఎంపికచేసుకున్నాడు. అటు బాలీవుడ్-ఇటు టాలీవుడ్ ప్రముఖులు కూడా రానా పెళ్ళి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ అయిపోవడంతో పెళ్లి ముహూర్తం గురించి ఆలోచిస్తున్నారు. ఇటు యాంకర్, నటి అనసూయ కూడా రానా-మిహికాలకు అభినందనలు తెలిపింది. 

ముంబై కలిపింది ఇద్దరినీ.. రానా ప్రేమకథ

https://www.photojoiner.net/image/SnhlLDzS

Image

Image

https://www.photojoiner.net/image/XNBmPqYr

https://www.photojoiner.net/image/387EvNDM

https://www.photojoiner.net/image/UutkTJPX

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle