newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

09-08-202009-08-2020 18:48:24 IST
Updated On 09-08-2020 18:49:33 ISTUpdated On 09-08-20202020-08-09T13:18:24.706Z09-08-2020 2020-08-09T13:18:10.820Z - 2020-08-09T13:19:33.551Z - 09-08-2020

రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే మూవీ మొఘల్ మనవడు.. దగ్గుబాటి వారి ఘనమయిన వారసుడు.. స్క్రీన్ మెచ్చిన ధీరుడు.. భళ్లాలదేవుడు రానా పెళ్లి వైభవంగా జరిగింది. ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా ఓ ఇంటివాడయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహీకా బజాజ్ తో హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.  కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఈ సెలబ్రిటీల మ్యారేజికి చాలా కొద్దిమంది అతిథులనే పిలిచారు. కేవలం 30 మందిలోపే గెస్టులు ఉండేలా నిర్మాత సురేష్ బాబు చర్యలు తీసుకొన్నారు.

Image

అల్లు అర్జున్, సమంత అక్కినేని, రామ్ చరణ్ దంపతులు పెళ్లికి వచ్చినట్టు తెలిసింది! దగ్గుబాటి ఫ్యామిలీ పక్కాగా కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ పెళ్లి నిర్వహించింది. పెళ్లికి రాని వారి కోసం వీఆర్ టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్ లో చూసిన అనుభూతి కల్పించడం విశేషం. పెళ్ళికి వారం ముందునుంచే దగ్గుబాటి సురేష్ ఇంట సందడి ఏర్పడింది. రానా పెళ్లి వేడుకలో వెంకటేష్ బ్లాక్ సూట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

రానా దంపతులు హడావిడిగా అతిథులతో కనిపించారు.రానా, మిహిక బజాజ్‌కు అత్యంత సన్నిహితులుగా రాంచరణ్, ఉపాసన దంపతులకు పేరుంది. దగ్గుబాటి, కొణిదెల కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రానా, రాంచరణ్ మధ్య స్కూల్ నుంచి స్నేహం ఉంది. ముఖ్యంగా రాంచరణ్, ఉపాసనతోపాటు మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పెళ్లికొడుకు, పెళ్లికూతురు వెనుక ఉపాసన, రాంచరణ్ కనిపించి చిరునవ్వులతో అందరిలో ఉత్సాహం నింపారు. అయితే బాహుబలి మూవీతో  రానాకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు రాజమౌళి కరోనా కారణంగా దూరంగా వున్నారు. 

Image

నటుడు నవదీప్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. రానా- మిహికాలకి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విటర్ ద్వారా రానాకు విషెస్ తెలియజేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అక్షయ్ ట్వీట్ చేశారు.

 

టాలీవుడ్ లోకి "ఫిలిమ్" ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ ఏ సినిమానో తెలుసా..?

టాలీవుడ్ లోకి "ఫిలిమ్" ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ ఏ సినిమానో తెలుసా..?

   2 minutes ago


నిజమైన హీరో 'సోనూ సూద్'‌కి ఐరాస అవార్డు

నిజమైన హీరో 'సోనూ సూద్'‌కి ఐరాస అవార్డు

   3 hours ago


'చందమామ' మాన్య చిత్రకారులు శంకర్ గారు ఇక లేరు..

'చందమామ' మాన్య చిత్రకారులు శంకర్ గారు ఇక లేరు..

   3 hours ago


కార్తికేయ 2లో భారీ మార్పులు.. ఇంతకీ ఏంటా మార్పులు..?

కార్తికేయ 2లో భారీ మార్పులు.. ఇంతకీ ఏంటా మార్పులు..?

   3 hours ago


సేమ్ టీంతోనే ఎఫ్3..స్టార్ట్ అయిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ..!

సేమ్ టీంతోనే ఎఫ్3..స్టార్ట్ అయిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ..!

   6 hours ago


అందరి భద్రత గురించి ఆలోచిస్తా.. థియేటర్స్ తెరుచుకునే సమయం ఇదే

అందరి భద్రత గురించి ఆలోచిస్తా.. థియేటర్స్ తెరుచుకునే సమయం ఇదే

   6 hours ago


బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

   15 hours ago


ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?

ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా సినిమానా..? వర్కవుట్ అవుతుందా..?

   15 hours ago


నిశ్శబ్దంలో మాధవన్, అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బయటపెట్టిన హేమంత్ మధుకర్!

నిశ్శబ్దంలో మాధవన్, అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బయటపెట్టిన హేమంత్ మధుకర్!

   17 hours ago


వెంకీ సినిమాని శర్వా చేయనున్నాడా..?

వెంకీ సినిమాని శర్వా చేయనున్నాడా..?

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle