newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రాజమౌళి ఫ్యామిలీకి కరోనా పాజిటివ్....అందరూ హోం ఐసోలేషన్లోకి

30-07-202030-07-2020 09:10:10 IST
Updated On 30-07-2020 09:29:56 ISTUpdated On 30-07-20202020-07-30T03:40:10.668Z30-07-2020 2020-07-30T03:38:48.525Z - 2020-07-30T03:59:56.607Z - 30-07-2020

 రాజమౌళి ఫ్యామిలీకి  కరోనా పాజిటివ్....అందరూ హోం ఐసోలేషన్లోకి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ సినీరంగ ప్రముఖలను ఆందోళనకు గురిచేస్తోంది. బాలీవుడ్ లో బిగ్ బి ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడి కోలుకుంది. తాజాగా తెలుగులో దర్శకధీరుడు రాజమౌళికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌‌ ద్వారా తెలిపారు. తనతోపాటు మొత్తం ఫ్యామిలీకి కరోనా సోకిందని జక్కన్న పోస్ట్‌ చేశాడు. ఫ్యామిలీలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు చెప్పారు.

‘‘నాకు నా ఫ్యామిలీ మెంబర్స్‌కు కొన్ని రోజుల క్రితం జ్వరం లక్షణాలు కనిపించాయి. అది తగ్గుముఖం పట్టినా మేం టెస్టులు చేయించుకున్నాం. రిజల్ట్స్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. డాక్టర్‌‌ల సూచనల మేరకు మేం హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలు లేకుండా బాగున్నాం. కానీ జాగ్రత్తలు పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ అవడం కోసం ఎదురు చూస్తున్నాం. అవి వృద్ధి కాగానే ప్లాస్మా డొనేట్ చేస్తాం’ అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు. 

రాజమౌళి భార్య రమా రాజమౌళితోపాటు కూతురు ఎస్ఎస్ మయూఖ్యతో కలసి హైదరాబాద్‌లోని సొంతింట్లో వున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగులో బిజీగా వున్నాడు. కరోనా పాజిటివ్ అని తేలడంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసం అయితే తనను ఫోన్లో కాంటాక్ట్ చేయాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు జక్కన్న.

టాలీవుడ్ లో ఓ నిర్మాత కరోనా బారిన పడి ఇటీవల మరణించడం కలవరం కలిగిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనాతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ త‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన పలు సినిమాలకు ఆయన స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. గోపిచంద్‌తో ‘ యజ్ణం’, ‘రణం’ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. పోకూరి రామారావు మరణంతో టాలీవుడ్ బిత్తరపోయింది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మాతలు, దర్శకులు, హీరో, హీరోయిన్లను కోరింది. 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle