newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

రవిబాబులో కనిపించని కోణాలెన్నో!

11-09-201911-09-2019 15:26:12 IST
2019-09-11T09:56:12.033Z11-09-2019 2019-09-11T09:55:52.319Z - - 21-01-2020

రవిబాబులో కనిపించని కోణాలెన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

‘కాదేది కవితకనర్హం’ అన్న తీరుగా ..ఆయన దేనితోనైనా సినిమా తీయగలడు..ఏ క్యారెక్టర్ లోనైనా జీవించగలడు..దయ్యాలతో రొమాన్స్ చేయించగలడు..పందికి కూడా నటన నేర్పగలడు. ఆఖరికి కుక్కర్‌ని కూడా ఆయన వదలలేదు. దాన్ని కూడా ఆయన సినిమాల్లో పెట్టేశాడు. అతనే నటుడు..దర్శకుడు రవిబాబు. విభిన్న చిత్రాలు తెరకెక్కించడంలో ఈయనకి సాటి లేరు. ఇతనికి సినీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు తనయుడే ఈ రవిబాబు.  సినిమాల్లో విలన్ గా ఆయన నటప్రస్థానం మొదలయింది. ఆ తర్వాత అమెరికా వెళ్లి డైరెక్షన్ లో శిక్షణ పొందాడు. తిరిగి వచ్చి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు రవిబాబు. ఈయన నిర్మాత..రచయిత కూడా.

రవిబాబు  డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం అల్లరి. ఈ చిత్రంతో ఇవివి సత్యనారాయణ రెండో కుమారుడు నరేష్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. విశేషం ఏంటంటే ఆ చిత్రం పేరు నరేష్ ఇంటి పేరుగా మారి అల్లరి నరేష్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత అమ్మాయిలు..అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలు ఫ్లాప్ కాదు గానీ ఓ మోస్తరు విజయాన్ని రవిబాబుకి తెచ్చిపెట్టాయి.

పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా నటిస్తూనే డైరెక్షన్ లో తనదైన ముద్రని వేశాడు. అనసూయ చిత్రంలో విలన్‌గా .. మురారిలో బుల్లబ్బాయిగా ఇన్నోసెంట్ విలన్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు ..సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో గూడిరాజుగా మంచి వినోదాన్ని పండించాడు రవిబాబు. విలనే కానీ ఆ విలనిజంతో కామెడీని చేయగల సమర్థత కలవాడు రవిబాబు. అందుకు తగ్గట్టుగా తన బాడీలాంగ్వేజ్ ని మార్చుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు.  

రారాకృష్ణయ్య, స్వామిరారా, గుండెల్లో గోదావరి, అవును, రచ్చ, మనసారా, అమరావతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, కాళిదాసు, ఆట, తొలిప్రేమ, నేనున్నాను, ఈడోరకం..ఆడోరకం, పవిత్ర, దోచేయ్ చిత్రాలలో హీరోలతో పోటీగా నటించాడు. ఆయన దర్శకత్వంలో ఏజెంట్ గోపి, అమరావతి, నచ్చావులే, మనసారా, అనసూయ, పార్టీ, సోగ్గాడు చిత్రాలు వచ్చాయి. కాగా రవిబాబు నిర్మాతగా..రైటర్ గా అనసూయ చిత్రాన్ని నిర్మించాడు. నువ్విలా చిత్రంతో ఆరు మంది నూతన నటీ నటులను ఆయన తెలుగు తెరకి పరిచయం చేశాడు. హర్రర్ కథాంశంతో అవును చిత్రాన్ని తీసి దర్శకుడిగా తనేమిటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం రవికి విజయాన్ని తెచ్చి పెట్టింది. 

ఈ చిత్రం తర్వాత అవునుకి సీక్వెల్ ని కూడా తీశాడు. పందిపిల్లని పెట్టి అదిగో అని టైటిల్ పెట్టి తీసిన చిత్రం రవిబాబుకి వినూత్న దర్శకుడిగా పేరు తెచ్చింది. ఇకపోతే అల్లరి నరేష్ తో లడ్డూబాబు అనే చిత్రాన్ని తీశాడు రవిబాబు. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్టే. ఈ చిత్రంలో నరేష్ చాలా లావుగా ఉండి అందరూ నవ్వుకునేలా ఆయన పాత్రని డిజైన్ చేశాడు. ఈ చిత్రం కూడా రవిబాబుకి నిరాశే మిగిల్చింది.

ఆయన తీస్తున్న చిత్రాలు జయపజయాలతో సంబంధం లేకుండా దర్శకత్వాన్ని వీడకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా తాను తీయాలనుకున్న కాన్సెప్ట్ లతో చిత్రాలను చేస్తూనే ఉన్నాడు రవిబాబు.  లేటెస్ట్ గా ఆవిరి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రవిబాబు. ఈ చిత్రంలో రవిబాబు కూడా నటిస్తూ..దర్శకత్వం  వహించాడు. నేహా చౌహన్..శ్రీముక్త..భరణిశంకర్..ముక్తర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్లైయింగ్ ప్రాగ్స్ నిర్మిస్తుంది. విశేషం ఏంటంటే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ మూవీని విడుదల చేస్తున్నారు. మరి ఈ చిత్రమైనా రవిబాబుకి ఆశించిన విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూద్దాం. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle