newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్ ఏమన్నాడంటే..

21-08-201921-08-2019 15:45:43 IST
2019-08-21T10:15:43.708Z21-08-2019 2019-08-21T10:06:38.977Z - - 19-11-2019

యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్ ఏమన్నాడంటే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్, అల్కాపురి టౌన్ షిప్ దగ్గర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజ్ తరుణ్ స్వల్ప గాయాలతో బయట పడిన సంగతి తెలిసిందే. కానీ ప్రమాదం తరువాత రాజ్ తరుణ్ పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

దాంతో రాజ్ తరుణ్ ఎందుకు పారిపోయాడు? అనే విషయం చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. " నేను క్షేమంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.

నార్సింగ్ సర్కిల్ గుండా ప్రయాణిస్తున్నాను. హఠాత్తుగా కారును కుడివైపునకు తిప్పడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొంది. దాంతో చెవులు, దృష్టి, పని చేయడం ఆగిపోయాయి. గుండె వేగం పెరిగిపోవడంతో ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నేను క్షేమంగానే బయటపడ్డాను. వెంటనే ఇంటికి వెళ్లాను. ఆరోజు ఇదే జరిగింది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ షూటింగ్‌కు హాజరవుతాను. ధన్యవాదాలు` అని రాజ్ తరుణ్ ట్వీట్ చేశాడు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle