newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

'మైండ్ బ్లాక్' సాంగ్.. దేవి తుస్సుమనిపించాడు

03-12-201903-12-2019 09:02:28 IST
2019-12-03T03:32:28.924Z03-12-2019 2019-12-03T03:03:40.567Z - - 25-05-2020

'మైండ్ బ్లాక్' సాంగ్.. దేవి తుస్సుమనిపించాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు'. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలతో పాటు ఓ రేంజ్ లో టెన్సన్ కూడా ఉంది. సంక్రాంతికే విడుదల అవుతున్న అల్లు అర్జున్ 'అల..వైకుంఠపురము' సినిమా నుండి విడుదల చేసిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. 'సామజవరగమనా' సాంగ్ 100 మిలియన్ వ్యూస్ పట్టేయగా 'రాములో రాములా' సాంగ్ 100 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది.

'ఓ మై గాడ్ డాడీ' అంటూ వచ్చిన సాంగ్ రెండు పాటల రేంజ్ లో కాకపోయినా పర్వాలేదనిపించింది. దీంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై ఒత్తిడి పెరిగింది. థమన్ ఇచ్చిన పాటలకు దీటుగా దేవి శ్రీ ప్రసాద్ కూడా పాటలు చేయవలసి వచ్చింది. అందుకే మహేష్ బాబు & కో దేవి శ్రీ ప్రసాద్ పై ఒత్తిడి పెంచారని కథనాలు కూడా వినబడ్డాయి.

దేవిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి చిత్ర యూనిట్ ముందుగా టీజర్ విడుదల చేసింది. టీజర్ మంచి రెస్పాన్స్ పట్టేయడంతో బాటు ట్రెండింగ్ లో కూడా ఎక్కువ రోజులు ఉంది. ఆ తరువాత ప్రతి సోమవారం ఒక పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వారు ప్రకటించినట్లు గానే సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను సోమవారం విడుదల చేశారు. 

'మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్..బాబు నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.. బాబు నువ్వు స్టెప్పే స్తే మైండ్ బ్లాకు.. ఎపుడూ ఫ్యాంటేసేవాడు ఇపుడు లుంగీ క‌ట్టాడు ఎపుడూ ష‌ర్టేసేవాడు ఇపుడు ఝ‌బ్బా తొడిగాడు చేతికేమో మ‌ల్లెపూలు క‌ళ్ల‌కేమో క‌ళ్ల‌జోడు చుట్టేసి – పెట్టేసి వ‌చ్చేశాడూ' అంటూ వచ్చిన ఈ పాటకు శ్రీమణితో బాటు దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు.

బ్లాజీ, రెనీనా రెడ్డి ఆలపించిన ఈ ర్యాప్‌ స్టయిల్‌ మాస్‌ సాంగ్‌ కు దేవి అందించిన సంగీతం చాలా సాదా సీదాగా సాగింది.ఏ మాత్రం కొత్తదనం లేని ట్యూన్ కు నాలుగు రాప్ ముక్కలు, నాలుగు మహేష్ బాబు మాటలు యాడ్ చేసి దేవి ఏదో సో సో అనిపించాడు. పక్కా మాస్ బీట్ అంటూ దేవి, అనీల్ రావిపూడి చెప్పడంతో ఈ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ అనుకున్న రేంజ్ లో పాట లేకపోవడం మహేష్ అభిమానులకు నిరాశ కలిగించింది.  'నేను శైలజా' సినిమాలోని 'శైలజా శైలజా' పాట ట్యూన్ నే దేవి అటు ఇటు మార్చి 'మైండ్ బ్లాక్' పాటను చేశాడని కామెంట్స్ పడుతున్నాయి. కేవలం మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ పాట ఇప్పటి వరకు 3.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో 25k మంది ఈ పాటకు డిస్ లైక్స్ కొట్టారు. ఈ పాటతో దేవి ఫామ్ లో లేడనే విషయం అర్ధమవుతోంది. 'మైండ్ బ్లాక్' అయ్యే సాంగ్ వస్తోందని ఊరించి ఊరించి చివరకు దేవి శ్రీ ఊసూరు మనిపించాడని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన పాటే యిలా ఉంటే మిగిలిన పాటలు ఎలా ఉండనున్నాయో దేవికే తెలియాలి? రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు. 

 

 

 

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   18 hours ago


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


టాలీవుడ్‌కి ‘తారక’మంత్రం.. ఎన్టీఆర్ బర్త్ డే.. ట్వీట్ల వరద.

టాలీవుడ్‌కి ‘తారక’మంత్రం.. ఎన్టీఆర్ బర్త్ డే.. ట్వీట్ల వరద.

   20-05-2020


క్రికెటర్‌తో వరలక్ష్మి పెళ్లి.. నిజమేనా?

క్రికెటర్‌తో వరలక్ష్మి పెళ్లి.. నిజమేనా?

   20-05-2020


 ఫ్యాన్స్‌కు సోనాలీ కులకర్ణి గుడ్ న్యూస్

ఫ్యాన్స్‌కు సోనాలీ కులకర్ణి గుడ్ న్యూస్

   19-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle