newssting
BITING NEWS :
*ఇసుక ఫిర్యాదులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి...క్యాంప్‌ ఆఫీస్‌లోనే కాల్‌ సెంటర్‌ ఏర్పాటు *అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం *బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో ఘోర ప్రమాదం...గ్యాస్ పైప్‌ లీకై సంభవించిన పేలుడు...ఏడుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు*ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలి...లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలి-టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ *కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్...మంత్రి కొత్త బూతులు నేర్పుతున్నాడంటూ ఆగ్రహం....సీఎం జగన్ అన్యమతస్తుడై తిరుమలకు వెళ్లారు...జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు-వర్ల రామయ్య *ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు*కర్నూలు ఎమ్మార్వో ఆఫీస్‌లో వీఆర్‌ఓల బాహాబాహీ...తహశిల్దార్ ముందే వీఆర్‌ఓల ఘర్షణ*లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి...మృతదేహం ఏలూరుకు తరలింపు*నిజామాబాద్ జిల్లా ధర్మారంలో దారుణం...కన్న కొడుకుని అతి కిరాతకంగా ఉరివేసి చంపిన తల్లి*ఏపీ స్పీకర్ తమ్మినేనికి యనమల రామకృష్ణుడు లేఖ...స్పీకర్ స్థానంలో ఉండి..తమ్మినేని వ్యాఖ్యలు అభ్యంతరకరం *ఇవాళ్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

మెగా బర్త్ డే వేడుకల్లో మెగా హీరోలంతా!

20-08-201920-08-2019 12:34:22 IST
2019-08-20T07:04:22.345Z20-08-2019 2019-08-20T07:04:14.766Z - - 19-11-2019

మెగా బర్త్ డే వేడుకల్లో మెగా హీరోలంతా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈనెల 22వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.  మాములుగా పుట్టినరోజు వేడుకలకు మెగాస్టార్ దూరంగా ఉంటారు.

చాలా తక్కువ సందర్భాల్లో పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ పాల్గొంటూ ఉంటారు. ఈసారి కూడా మెగాస్టార్ ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అయితే, మెగా కుటుంబం ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఆగష్టు 22వ తేదీన శిల్పకళా వేదికలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు మెగా హీరోలందరూ హాజరుకాబోతున్నారని సమాచారం.రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా అందరూ హాజరువుతున్నారట.

Image

ఈ వేడుకలకు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే.. ఆ హంగామా అనేది వేరుగా ఉంటుంది.

మెగా బ్రదర్స్ అందరూ ఒకే స్టేజ్ పైన, మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేడుకలో ఉంటే మెగా ఫ్యాన్స్ ఆగుతారా..చెప్పండి.. ఆ సందడే వేరుగా ఉంటుంది.మరి ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్ కూడా ఉండబోతున్నాయట.

ఈసారి `సైరా`బర్త్ డే గా భావించి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికే కామన్ డీపీని లాంచ్ చేశారు. ఈ డీపీని చూసి మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle