newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

మెగాఫోన్ పట్టిన జొన్నవిత్తుల.. ఆర్జీవీపై బయోపిక్

14-02-202014-02-2020 13:44:28 IST
Updated On 14-02-2020 13:44:44 ISTUpdated On 14-02-20202020-02-14T08:14:28.604Z14-02-2020 2020-02-14T08:13:40.209Z - 2020-02-14T08:14:44.781Z - 14-02-2020

మెగాఫోన్ పట్టిన జొన్నవిత్తుల.. ఆర్జీవీపై బయోపిక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాంగోపాల్ వర్మకు అందరినీ గిల్లితే గానీ నిద్రపట్టదు. ఆయన తీసే సినిమాలు వెరైటీగా, వివాదాస్పదంగా వుంటాయి. సెటైర్లు పిచ్చెక్కిస్తాయి. అలాంటి వర్మను టచ్ చేయడం ఎవరితరం కాదు. కానీ, ప్రముఖ సినీ గీత రచయిత జొన్నవిత్తుల వర్మపై సినిమా తీస్తున్నారు. ఆయన కలాన్ని వదిలి మెగాఫోన్‌ చేపట్టారు. బాల కుటుంబరావు పొన్నూరి నిర్మించే ‘ఆర్జీవి’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా మొదలైంది.

‘ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఓ సిద్ధాంతంలా ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా రూపొందిస్తున్నాను. ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుంది మార్చి మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. గతంలో కూడా ఆయన హాస్యనటుడు ఆలీతో “సోంబేరి” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 

సినిమా పరిశ్రమలో పాటల రచయితగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఆర్జీవీని టార్గెట్ చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. రాంగోపాల్ వర్మ గతంలో ఓ టీవీ చర్చలో జొన్నవిత్తుల చౌదరి అని కామెంట్ చేశాడు. దీనికి బాగా నొచ్చుకున్న కవిగారు రాంగోపాల్ వర్మపై విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఆయనపై ఓ సినిమా చేస్తానని ప్రకటించారు.  వర్మపై కోపంతో వర్మకు పప్పు వర్మ అని పేరు పెట్టారాయన.

అదే టైటిల్ తో పేరడీ సినిమా తీయబోతున్నానని, దానిని నిజం చేస్తున్నారు. వర్మ జీవితాన్ని ఎన్ని కోణాల్లో, పిచ్చి వెరైటీ సెటైర్లతో సినిమా తీస్తానన్నారు. వ్యక్తుల గురించి సినిమాలు తీసి మీగురించి సినిమాలు తీయలేదని వర్మ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీపై విమర్శలు చేశారు జొన్నవిత్తుల. ఎవరి గురించి తీస్తున్నావో.. ధైర్యంగా చెబితే అంతా సంతోషించేవారన్నారు. రాంగోపాల్ వర్మ గురించి జొన్నవిత్తుల సంచలన వ్యాఖ్యలు చేశారు

బూతు కామెంట్లు పెట్టే ఎదవలకు ఎంప్లాయిమెంటిస్తా

బండ బూతు కామెంట్స్ నా విమర్శకులపై పెట్టిస్తా

చచ్చే టెన్షన్ అనుభవిస్తూ పైకి కూల్ గా కనిపిస్తా

ఎవ్వడెంతగా తిట్టినా ఫ్రీ పబ్లిసిటీ అనుకుంటా

లక్షమందిని లవ్ చేస్తా .. కోటిబాటిల్స్ తాగుతా సెలబ్రిటీలను కెలుకుతా అంటూ ఓ పేరడీ అంటించేశారు జొన్నవిత్తుల. ఇంతకీ జొన్నవిత్తుల తన బయోపిక్ లో ఇంకెన్ని వివాదాస్పద అంశాలుంటాయో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle