newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

‘ముఖ్యమంత్రి గారూ మీరు మాట తప్పారు’

18-03-201918-03-2019 14:30:27 IST
Updated On 18-03-2019 18:36:46 ISTUpdated On 18-03-20192019-03-18T09:00:27.983Z18-03-2019 2019-03-18T09:00:26.161Z - 2019-03-18T13:06:46.595Z - 18-03-2019

‘ముఖ్యమంత్రి గారూ మీరు మాట తప్పారు’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ దర్శకుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి  ఏపీ సీఎం చంద్రబాబుపై ఒకస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై తాను తీసిన ‘ముఖ్యమంత్రి గారూ మీరు మాట ఇచ్చారు’ సినిమాకి సంబంధించి ఈసీకి మూడు పేజీల సమాధానం ఇచ్చానని, కానీ రమ్మంటున్నారని.. అసలేం సినిమా తీశానో, అందులో ఏ సన్నివేశాలున్నాయో కూడా చూడకుండా, తెలియకుండానే  గుడ్డిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇంత వరకూ నేను మీకు చెప్పలేదు. నేను ఒక సినిమా తీశాను. దేశానికి ఉపయోగపడే సినిమా' అని తెలిపారు. ఈ మధ్య సినిమాలపై ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయడం ఫ్యాషన్ అయిపోయిందన్న ఆయన.. ఎవడో అనామకుడు (మోహన్ రావు) ఫిర్యాదు చేస్తే తనను రోజూ అమరావతి పిలుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లపై తాను ఫిర్యాదు చేస్తే వారిద్దరిని కూడా పోలీసులు పిలిపిస్తారా..?  అని ప్రశ్నించారు పోసాని. వాళ్లకు ఒక రాజ్యాంగం.. సామాన్యులకు ఒక రాజ్యాంగం ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబునాయుడుపై పోసాని తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు పెద్ద దొంగ. వెన్నుపోటు పొడుస్తాడు. కులాలను కించపరుస్తూ దూషిస్తాడు. ఇవన్నీ జనాలకు తెలుసు. ఏం తెలియదని బాబును టార్గెట్‌ చేసే సినిమా తీయాలి? ఆయన తప్పులు చేయొచ్చు.. కానీ నేను సినిమా తీయకూడదా? అని ప్రశ్నించారు.

‘‘ఎన్టీఆర్‌నే చంపిన వ్యక్తికి జగన్‌ ఓ లెక్క కాదు. నోట్లో నుంచి లింగాలు తీసినట్టు... చంపుతారు... లెటర్లు సృష్టిస్తారు..’’ అంటూ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు పోసాని. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక సినిమా తీస్తానని ప్రకటించిన పోసాని ఇప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టేసాడని అంటున్నారు. ఇటీవల ఆయన చిత్రబృందంతో కలిసి పులివెందులలో హడావిడి చేశారు. ఈ సినిమాలో సినీ నటుడు అలీ,జీవా, బాబుమోహన్‌ కూడా నటిస్తున్నారు. గోల్డెన్‌ఎరా ప్రొడక్షన్‌ నెంబర్‌-1 నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తర్వాత పోసాని మూవీ వివాదాస్పదం అవుతోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle