newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

మాస్ మహరాజ్ హిట్ కొట్టేనా

19-09-201919-09-2019 13:38:08 IST
2019-09-19T08:08:08.390Z19-09-2019 2019-09-19T08:07:59.319Z - - 20-10-2019

మాస్ మహరాజ్ హిట్ కొట్టేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించాడు..ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేశాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.1997లో  కృష్ణవంశీ తీసిన సింధూరం చిత్రంలో నటుడు బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా  చేశాడు రవితేజ. ఈ చిత్రంలో రవితేజ నటి సంఘవిని ఏడిపిస్తూ హయిరే హయ్ అనే  సాంగ్ తో నటుడిగా గుర్తింపుని తెచ్చుకున్నాడు.

సినిమాల్లోకి రాకముందే జైపూర్.. ఢిల్లీ.. ముంబై.. భోపాల్ లాంటి ప్రదేశాలను చుట్టివచ్చాడు రవితేజ. అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఈయన హీరోగా చేయడానికి చాలా కాలం సమయం పట్టింది. 1999లో దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన చిత్రం నీ కోసం లో హీరోగా నటించాడు రవితేజ. ఈ చిత్రంలో మహేశ్వరి హీరోయిన్. ఈ చిత్రానికి రవితేజ నటనకి మంచి మార్కులతో పాటు అవార్డు కూడా వచ్చింది. 

ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో సాఫ్ట్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు ఈ నటుడు. ఇడియట్ చిత్రంతో మాస్ మహారాజ్ అనే బిరిదుని సొంతం చేసుకున్నాడు. ఆపై వరుసగా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి.. డాన్ శ్రీను.. కిక్.. విక్రమార్కుడు.. కృష్ణ.. వెంకీ.. భద్ర.. బలాదూర్.. బలుపు.. పవర్.. దరువు.. దుబాయ్ శీను.. నా ఆటోగ్రాఫ్.. శంభో శివ శంభో..అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రాలను చేశాడు. 2017లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించి మాంచి కామెడీని ప్రేక్షకులకు పంచాడు.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే  ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్..ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గోవాలో కూడా జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం సోషల్ మీడియాలో షూటింగ్ ని పూర్తి చేసినట్టు పోస్ట్ చేసింది. గోవాలో కొన్ని సీన్స్ తో పాటు పాటలను కూడా చిత్రీకరించామని వెల్లడించింది. కాగా ఐస్ ల్యాండ్ లో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం.

ఈ మూవీలో రవితేజ మరోసారి మాస్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తాడని దర్శక..నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రవితేజ సరసన నటి పాయల్ రాజ్ పుత్..నభానటేష్..తాన్యాహోప్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో బాబీ సింహా..వెన్నెల కిషోర్..సునీల్..సత్య నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆనంద్.ఐ.వి దర్శకుడు. నిర్మాత తాళ్ళూరి రామ్. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle