newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

మహేష్ ఒకే అంటే రేపే 'అతడు 2'!

15-09-202015-09-2020 18:41:03 IST
2020-09-15T13:11:03.153Z15-09-2020 2020-09-15T13:11:00.195Z - - 29-09-2020

మహేష్ ఒకే అంటే రేపే 'అతడు 2'!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అతడు. 2005 లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికి కూడా టీవీలో వచ్చిన ప్రతీసారి మంచి టిఆర్పి వస్తుంది. ఈ సినిమా శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు, నిర్మాతైన మురళీమోహన్ నిర్మించారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. పాటలు కూడా మంచి విజయం సాధించాయి.

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మహేష్ బాబు నందు అనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో నటించాడు. ఒక హత్య చేయడానికి సుపారీ తీసుకుంటాడు. కానీ వేరే ఎవరో హత్య చేస్తారు. పోలీసులు మహేష్ ని వెంబడించగా మహేష్ పారిపోతూ ఓ ట్రైన్ ఎక్కుతాడు. అందులో పార్థు అనే వ్యక్తి పరిచయమవుతాడు. పోలీసులు మహేష్ ని కాల్చబోయి పార్థుని కాలుస్తారు.

చిన్నప్పుడు తప్పిపోయిన పార్థు స్థానంలో మహేష్ ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడ కుటుంబంలోని ప్రేమానురాగాలు చూసి అక్కడే ఉండిపోవాలి అనుకుంటాడు. కానీ పోలీసులు రావడంతో కథ మళ్ళీ మొదటికి వస్తుంది. చివరకి హీరో తప్పు చేయలేదని నిరూపించుకొని, కుటుంబంలోని వాళ్ళకి కూడా జరిగింది చెప్పి కలిసిపోతాడు. ఇందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ విలన్ గా నటించాడు. ఈ సినిమాలోని డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, పాటలు, త్రిష అందం, నాజర్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు నటన, మణిశర్మ సంగీతం ఇవన్నీ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి.      

ఈ సినిమా ఇప్పటికి కూడా ఒక మంచి క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సినిమా నిర్మాత మురళి మోహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, తన కెరీర్ లో నిర్మించిన మంచి సినిమాల్లో అతడు ఒకటని, మహేష్ బాబు అదిరిపోయే నటన, త్రివిక్రమ్ సూపర్బ్ డైరెక్షన్ ఆ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ అని అన్నారు.

తనకు ఎంతో ఇష్టమైన ఆ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 నిర్మించాలనే కోరిక నాకు ఉందని, ఒకవేళ హీరో మహేష్, డైరెక్టర్ త్రివిక్రమ్  ఒప్పుకుంటే రేపే సినిమాని పట్టాలెక్కించడానికి తాను సిద్ధం చేస్తానని అన్నారు. మరి మురళి మోహన్ భావిస్తున్నట్లుగా ఆ సినిమాకి నిజంగానే సీక్వెల్ వస్తుందో రాదో చూడాలి. అభిమానులు కూడా మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ కలిసి పని చేయాలి అని అనుకుంటున్నారు.  

 

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

   3 hours ago


సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

   6 hours ago


పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

   6 hours ago


91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

   8 hours ago


బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

   9 hours ago


నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

   10 hours ago


క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

   10 hours ago


విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

   10 hours ago


బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

   11 hours ago


ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle