newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. చేతిపై జగన్ పేరుతో మెహిందీ

13-05-201913-05-2019 13:01:36 IST
2019-05-13T07:31:36.038Z13-05-2019 2019-05-13T07:31:32.739Z - - 06-04-2020

మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. చేతిపై జగన్ పేరుతో మెహిందీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరుకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆమె ఏం చేసినా సంచలనమే. క్యాస్టింగ్ కౌచ్ అంటూ సినీ రంగంలో సునామీ సృష్టించింది. అర్థనగ్నంగా ఓ ఛానెల్ ముందు ఆమె చేసిన హంగామా అంతా ఇంతాకాదు.

తర్వాత ఏదో ఒక అంశంపై ఆమె స్పందిస్తూనే ఉంటుంది. ఎవరినో ఒకరిని ఆమె కదుపుతూ ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. పాపులారీటీ కోసం దేనికైనా దిగజారే శ్రీరెడ్డి మరోసారి తన పాపులారిటీ చేష్టల్ని సోషల్ మీడియా వేదిక మీదకి వదిలింది.

ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పైన ఆయన ఫ్యాన్స్‌పైన వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆరున్నర మిలియన్ ఫాలోవర్స్‌ని రాబట్టింది శ్రీరెడ్డి. మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్ పై పడింది. పొలిటికల్ యాంగిల్‌లోనూ పాపులర్ కావాలని తెగ ప్రయత్నం చేస్తోంది.

ఏపీ ఎన్నికల సందర్భంగా శ్రీరెడ్డి సర్వే అంటూ రానున్న ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందన్న శ్రీరెడ్డి. ఇటీవల రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ కొత్త పల్లవి అందుకుని జగన్‌కి అనుకూలంగా పొలిటికల్ పోస్ట్‌లు వదలడం కలకలం రేపుతోంది. 

అంతేకాదు. ఏకంగా జగన్ ఫొటోతో ‘ఆయనే సీఎం కావాలని ఆకాంక్షిస్తూ జగన్ రావాలి అందరి లెక్కలు తేల్చాలి. శత్రుశేషం మిగలకూడదు’ అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ పెట్టింది. 

ఇక జగన్‌పై అభిమానం మరింత ముదరడంతో తన చేతిపై జగన్ అనే పేరును గోరింటాకుతో రాసుకుని సోషల్ మీడియా వీడియో పోస్ట్ చేసింది. కొంతమంది జగన్ ఫ్యాన్స్ దీనిని సమర్థిస్తుంటే.. మా జగనన్నని వదిలెయ్ తల్లీ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. శ్రీరెడ్డి ఒక పార్టీకి కాని, ఒక వ్యక్తికి గాని సపోర్ట్ చేసింది అంటే వాళ్ల పని అయిపోయినట్టే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి జగన్ పార్టీని సపోర్ట్ చేసిన శ్రీరెడ్డి పవర్ ఎలా ఉంటుందో మే 23న తేలనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle