facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

మళ్ళీ పెళ్ళికి మలైకా రెడీ... అర్జున్ కపూర్ హడావిడి

13-03-201913-03-2019 12:39:40 IST
Updated On 13-03-2019 13:16:23 ISTUpdated On 13-03-20192019-03-13T07:09:40.711Z13-03-2019 2019-03-13T07:08:50.517Z - 2019-03-13T07:46:23.196Z - 13-03-2019

మళ్ళీ పెళ్ళికి మలైకా రెడీ... అర్జున్ కపూర్ హడావిడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నటి మలైకా అరోరా నటుడు అర్జున్ కపూర్‌ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే వుంది. వీరి గురించి జనం చెవులు కొరుక్కుంటున్నారు. తనకంటే 12 ఏళ్లు పెద్దది అయిన మలైకా‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అర్జున్. ఈ నేపథ్యంలో మలైకా తన మనసులో మాటను బయటపెట్టింది. తాను అర్జున్ కపూర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంతమంది లవర్స్ ఉన్నా.. ఎంత మంది సీక్రెట్ లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్నా.. అందరి దృష్టి మాత్రం మలైకా-అర్జున్ ఎఫైర్ మీదే పడుతోంది.

ముఖ్యంగా అర్జున్ కపూర్, మలైకాలు ఎక్కడ కనిపించినా ఆ విజువల్స్ మాత్రం వదలటం లేదు. ఎక్కడికి వెళ్లినా అర్జున్ ఆమె చేతిలో చేయి వేసి మరీ తీసుకెళుతున్నాడు. త్వరలో వీరి పెళ్ళి జరగబోతోంది. అయితే హంగు ఆర్బాటం లేకుండా సింపుల్‌గా పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారని టాక్. 

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి.  ఏప్రిల్‌లో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాడు అర్జున్. పెళ్ళి అనంతరం వీరిద్దరూ కలిసి ఉండేందుకు ముంబయిలోని లొఖండవాలాలో అపార్ట్ మెంట్ కూడా కొనేశాడని టాక్. పెళ్లి చేసుకుని భర్తకు విడాకులిచ్చి .. పాపం అర్జున్‌ను వలలో వేసుకున్న మలైకా అతడిని పెళ్లి చేసుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబాయ్ అనిల్ కపూర్ కూడా వీరిద్దరి రిలేషన్ షిప్, పెళ్ళి వార్తలపై నో కామెంట్ అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle