newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

మరో సంచలనానికి సల్లూభాయ్ రెడీ.. దబాంగ్ 3 మోషన్ రిలీజ్

11-09-201911-09-2019 12:19:09 IST
Updated On 11-09-2019 12:19:07 ISTUpdated On 11-09-20192019-09-11T06:49:09.212Z11-09-2019 2019-09-11T06:45:33.301Z - 2019-09-11T06:49:07.131Z - 11-09-2019

 మరో సంచలనానికి సల్లూభాయ్ రెడీ.. దబాంగ్ 3 మోషన్ రిలీజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మంచి ఊపుమీద ఉన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న దబాంగ్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా కాంబినేషన్‌లో ఈమూవీ తెరకెక్కుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌.

Image may contain: 1 person, text

డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్నడ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. స‌ల్మాన్‌కి మిత్రుడు చిరంజీవి తనయుడు రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీపై ట్వీట్ చేశాడు.‘హండ్రెడ్ డేస్ టూ ద‌బాంగ్ 3’  అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేసి చిత్ర తెలుగు వ‌ర్షెన్ మోష‌న్ పోస్టర్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా షేర్ చేశాడు. 

ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇందులో సల్మాన్ డైలాగులు బాగున్నాయని కామెంట్లు పడుతున్నాయి. ‘ఆట‌కైన‌, వేట‌కైన రెడీ’ అంటూ సల్లూ భాయ్ చెప్పిన డైలాగ్ అభిమానుల‌ని అలరిస్తోంది. ఈమూవీలో  కిచ్చా సుదీప్ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

 ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3 కూడా అదే దారిలో బాక్సాఫీస్ కొల్లగొట్టడం ఖాయంగా చెబుతున్నారు. స‌ల్మాన్ ఈమధ్య భార‌త్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తాజాగా వచ్చిన దబాంగ్ 3 మోషన్ పోస్టర్ మీరూ చూసెయ్యండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle