newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

మరో వివాదం రేపిన వర్మ.. పోలీసుల షాక్

20-07-201920-07-2019 18:39:49 IST
Updated On 20-07-2019 18:42:19 ISTUpdated On 20-07-20192019-07-20T13:09:49.075Z20-07-2019 2019-07-20T13:09:47.109Z - 2019-07-20T13:12:19.926Z - 20-07-2019

మరో వివాదం రేపిన వర్మ.. పోలీసుల షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో వివాదాన్ని రేపాడు. రామ్ గోపాల్ వర్మ ..తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు..ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా త్రిపుల్ రైడ్‌తో హైదరాబాద్,మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు వెళ్లాడు. 
 
ఈ సందర్భంగా తాను త్రిపుల్ రైడింగ్‌తో సినిమా థియేటర్‌కు వచ్చిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఇదే సందర్భంలో వర్మ పెట్టిన మరో ట్వీట్ మాత్రం పోలీస్ శాఖకు సవాలు విసిరింది. "ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి వచ్చాం. పోలీసులు ఏరీ? వారు సినిమా థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తున్నారా?" అంటూ వర్మ పోస్ట్ మాత్రం కాకా రేపింది. 
No photo description available.
 
తమపై సెటైర్ వేసిన వర్మకు హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. ట్రిపుల్ రైడింగ్ లో హైదరాబాద్, మూసాపేట లోని శ్రీరాములు థియేటర్ కు వెళ్లిన వర్మ పోలీసులు ఏరి సినిమా చూస్తున్నారా అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అజయ్ భూపతి, అగస్త్య మంజు, ఆర్జివి ప్రయాణించిన వెహికిల్ నంబర్‌ను ట్రేస్ చేశారు. టీఎస్ 07 జీపీ 2552గా గుర్తించిన పోలీసులు.. బైక్ ఓనర్ దిలీప్ కుమార్‌కు 1300 రూపాయలు ఫైన్ వేశారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్ నేరాల కింద వీరికి ఫైన్ వేశారు. హైదరాబాద్ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Image may contain: 1 person
 
ఇదిలా ఉండగా గత రాత్రి చిత్ర యూనిట్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయం కావడంతో ఓ పార్టీ ఏర్పాటు చేసింది. తన శిష్యుడు పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించడంతో రామ్ గోపాల్ వర్మ సంతోషానికి అవధులు లేకుండా పోయింది.  చిత్ర నిర్మాత చార్మిని గట్టిగా కౌగిలించుకొని ఆర్‌జీవీ రచ్చ...రచ్చ చేశాడు. అంతే కాదు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ముద్దు కూడా పెట్టుకొని రాము తన సంతోషాన్ని పంచుకున్నాడు. నెను పిచ్చివాడిని కాదు.. కానీ ఇస్మార్ట్ శంకర్ చూశాక నా సంతోషం హద్దులు దాటింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు. 

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle