newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

భారీ బడ్జెట్ చిత్రాలు..కేరాఫ్ ప్రభాస్

13-08-201913-08-2019 17:27:02 IST
2019-08-13T11:57:02.567Z13-08-2019 2019-08-13T11:56:59.601Z - - 21-08-2019

భారీ బడ్జెట్ చిత్రాలు..కేరాఫ్ ప్రభాస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నటన అనేది ఆయనకి వారసత్వంగా వచ్చింది. ఆ  వారసత్వానికి మరింత వన్నె తెచ్చాడు..నటన అనే పదానికి కొత్త అర్థం చెప్పి  తన చిత్రం బాహుబలి ద్వారా  ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఉప్పల పాటి ప్రభాస్ రాజు. ఆయన పెద్దనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకి వారసుడిగా నిలిచాడు. పెద్దనాన్న పేరుకి ముందు బిరుదుకి యంగ్ ని జత చేర్చి యంగ్ రెబల్ స్టార్ గా తన హవాని కొనసాగిస్తున్నాడు నటుడు ప్రభాస్. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు ప్రభాస్ వాళ్ల స్వగ్రామం. అక్టోబర్ 23..1979వ సంవత్సరంలో సూర్యనారాయణరాజు..శివకుమారి దంపతులకు జన్మించాడు. 

ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్. ఈ మూవీ 2002లో వచ్చింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచాడు ఈ డార్లింగ్.  సినిమాలు అన్నాక అపజయాలు..విజయాలు మాములే. అపజయాల కంటే ప్రభాస్ ఖాతాలో హిట్ చిత్రాల లెక్కే ఎక్కువ. ప్రభాస్ లోని ప్రేమికుడిని చూడాలంటే వర్షం చిత్రంలో నే చూడాలి. త్రిష..ప్రభాస్ మంచి జోడీ అనిపించుకుని హిట్ ఖాతాలో నిలిచిందీ సినిమా. ఇక ప్రభాస్ లోని రౌద్రాన్ని చూపిన చిత్రం ఛత్రపతి. సినిమా టైటిల్ కి తగ్గ హీరో అనిపించుకున్నాడు. బుజ్జిగాడు చిత్రంతో ప్రభాస్ లో కూడా కామెడీ టచ్ ఉందన్న విషయం రుజువైయింది. దాంతో ఎటువంటి పాత్రలోనయినా ఇట్టే ఒదిగిపోతాడని దర్శక..నిర్మాతలకి అర్థం అయింది. 

ఆ నటనా పటిమే అతడిని బాహుబలి చేసింది. ఒక చిత్రం కోసం మూడు..నాలుగు సంవత్సరాల డేట్స్ ని ఒక డైరెక్టర్ కి రాసివ్వడం అంటే ఆషామాషీ సంగతేం కాదు. ఈ మూడు..నాలుగు సంవత్సరాలలో ఎలా లేదన్నా ఐదారు సినిమాలను ఈజీగా చేయగల సత్తా ప్రభాస్ కి ఉన్నా..బాహుబలి కథపై తాను పెట్టుకున్న నమ్మకం  వల్ల దర్శకుడు రాజమౌళికి తన డేట్స్ ని ఇచ్చేసి అమితమైన  భరోసా ఇచ్చేశాడు ఈ అమరేంద్ర బాహుబలి.  మరి ఈ బాహుబలి ఎంతటి సంచలనాన్ని  సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం తెలుగులోనే కాదు తమిళ్..హిందీ..మలయాళంలో బాహుబలి1 ని రిలీజ్ చేశారు. కాగా బాహుబలి2ని తెలుగు..తమిళ్..హిందీలో రిలీజ్ అయింది.  బాహుబలి ముందు చిత్రాలతో కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిచయం ఉన్న ప్రభాస్..ఈ చిత్రంతో ప్రపంచానికి సుపరిచితుడయ్యాడు. 

బాహుబలి తర్వాత రూ.300కోట్ల  రూపాయలతో తెరకెక్కుతున్న చిత్రం సాహోలో నటిస్తున్నాడు ప్రభాస్. హాలీవుడ్ ని తలదన్నేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు సుజిత్. ఈ చిత్రంలో హీరోయిన్ బాలీవుడ్ నటి. అంతేకాదు బాలీవుడ్ లోని ప్రముఖ నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ మేరకు విజయాన్ని సాధించనుందో తెలియదు కానీ అంచనాలు అయితే ఊహను మించిపోతున్నాయి. మనకే ఇలా ఉంటే  ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకెలా ఉంటుందో  ఊహించవచ్చు.   అంతేకాదు ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా..ఎన్నో  భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయట.  తాజాగా విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే  ఒక రేంజ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుదని తెలుస్తుంది. 

ఇకపోతే అందరికీ డార్లింగ్ అయిన ఈ ఆరడుగల అందగాడికి పెళ్లి ఘడియలు మాత్రం ఇంకా రాలేదు..తన తోటి వారికి..తన కంటే చిన్న వారికి వివాహాలు అయిపోతున్నాయి. మరోపక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే బిరుదు కూడా వచ్చేసింది. ఎప్పుడో గానీ మీడియాకి చిక్కడు..పొరపాటున చిక్కాడా అందరూ అడిగే ప్రశ్ననే విలేఖరులు కూడా మీ పెళ్లెప్పుడు అని ప్రశ్నిస్తే మనవాడు  ఏ మాత్రం తడబడకుండా ఓ చక్కటి చిరునవ్వు నవ్వి ఎస్కేప్ అవుతున్నాడు. ప్రభాస్ కి  పెళ్లంటే భయమా..ఇష్టం లేదా..కొంపదీసి బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్  లిస్ట్ లో చేరతాడా ఇన్ని అనుమానాలు వస్తున్నాయి జనాలకి. వీటన్నింటికి సమాధానం ప్రభాస్ నోటి వెంట వస్తే గాని ఈ సందేహాలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టువుతుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle