newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

భద్రత ఇస్తే టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బయట పెడతా.. శ్రీరెడ్డి

16-09-202016-09-2020 10:44:58 IST
Updated On 16-09-2020 11:17:10 ISTUpdated On 16-09-20202020-09-16T05:14:58.224Z16-09-2020 2020-09-16T05:14:56.538Z - 2020-09-16T05:47:10.456Z - 16-09-2020

భద్రత ఇస్తే టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బయట పెడతా.. శ్రీరెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొంత కాలంగా భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమలు డ్రగ్స్ కేసులతో సతమతమవుతున్నాయి. బాలీవుడ్ లో సుశాంత్ మరణం ఆత్మహత్య కేసుగా మొదలై ఆ తర్వాత డ్రగ్స్ కేసుగా మారింది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ   ఇలా అన్ని పరిశ్రమలలోను డ్రగ్స్ కేసు నడుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సుశాంత్ ప్రియురాలు రియాతో పాటు మరి కొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.

రియా కూడా ఈ కేసులో మరో 25 మంది పేర్లను బయట పెట్టింది. కన్నడ పరిశ్రమలో కూడా ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసి ఇంకొంతమందికి నోటీసులు ఇచ్చారు. కంగనా ఇప్పటికే బాలీవుడ్ లో కొంతంది డ్రగ్స్ వాడతారు అంటూ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పింది. కొంతంది ఆర్టిస్టులు కూడా బాలీవుడ్ లో డ్రగ్స్ మామూలే అంటున్నారు.  టాలీవుడ్ లో కూడా చాలా మంది డ్రగ్స్ వాడతారు అంటూ ఇప్పటికే నటి మాధవీలత డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈ డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

శ్రీరెడ్డి తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.  ఇటీవల శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది.టాలీవుడ్ లో కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న హీరోలను తొక్కేస్తున్నారని, వేషాలు ఎరవేసి అమ్మాయిలతో ఆడుకుంటున్నారని గతంలో చెప్పానని, అప్పట్లోనే డ్రగ్స్ గురించి కూడా నేను చెప్పానని తెలిపింది. చాలా మంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం నాకు తెలుసు అని శ్రీరెడ్డి చెప్పింది. నాకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానని, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

అంతేకాక బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని శ్రీరెడ్డి తెలిపారు. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై శ్రీరెడ్డి అభినందించింది. అలాగే టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీరెడ్డి ఆ వీడియో ద్వారా తెలిపింది.    

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

   2 hours ago


సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

   6 hours ago


పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

   6 hours ago


91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

   7 hours ago


బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

   8 hours ago


నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

   9 hours ago


క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

   9 hours ago


విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

   9 hours ago


బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

   10 hours ago


ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle