newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

'బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ లీక్...

21-09-201921-09-2019 10:55:48 IST
2019-09-21T05:25:48.524Z21-09-2019 2019-09-21T05:25:36.295Z - - 26-05-2020

'బిగ్ బాస్3’ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ లీక్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి రెండు సీజన్ లు విజయవంతం కావడంతో మూడో సీజన్ కోసం స్టార్ మా తగు జాగ్రత్తలు తీసుకుంది. నాగార్జున హోస్ట్ గా 100 రోజుల పాటు సీజన్-3 జరిగేలా ప్లాన్ చేశారు. 15 మంది సెలెబ్రిటీలను హౌస్ లోకి పంపారు. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో ఇప్పటికే కొందరు ఎలిమినేట్ కాగా మరి కొందరు హౌస్ లో ఉన్నారు. కంటెస్టెంట్స్ రెమ్యూనిరేషన్ పై గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం మేరకు ఈ షోలో హోస్ట్ నాగార్జున ఎపిసోడ్ కు 12 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వారానికి రెండు ఎపిసోడ్ లు ఉంటాయి.. అంటే నెలకి కనీసం 8 ఎపిసోడ్ లు వరకూ ఉంటాయి కాబట్టి.. ఆయనకి 96 లక్షల నుండీ 1 కోటి వరకూ అందుతుందన్న మాట. హౌస్ లో హేమ ఉన్న ఒక్క వారానికి 1.8 లక్షలు తీసుకుందని ప్రచారం జరుగుతోంది. 

‘పటాస్’ షో ద్వారా చాల క్రేజ్ సందించుకున్న యాంకర్ శ్రీముఖి కు.. ఒక్కో ఎపిసోడ్ కు 1.3 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం. 'తీన్మార్ వార్తల' ప్రోగ్రాంలో బిత్తిరి సత్తితో స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి అక్క అలియాస్ శివజ్యోతికి సీజన్ మొత్తం కలిపి 12 లక్షల వరకూ చెల్లిస్తున్నారట. ఆమె ఎన్ని వారాలు ఉన్నా ఇదే మొత్తం ఆమెకు ఇస్తారని తెలుస్తోంది. 'బిగ్ బాస్’ చరిత్రలోనే మొదటిసారి భార్యాభర్తలుగా  ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్, వితిక షెరు సీజన్ మొత్తానికి 18 లక్షల వరకూ తీసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ అమౌంట్ ని వీరిద్దరూ షేర్ చేసుకోవాలి. టీవీ9 జాఫర్ ఎపిసోడ్ కు లక్ష తీసుకున్నారట. వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నాకి  2 లక్షల వరకూ పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. అలాగే రాహుల్ సిప్లిగంజ్ సీజన్ మొత్తానికి 10 లక్షలు, జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషూ రెడ్డి కు మొత్తంగా 4లక్షలు, రోహిణికి వారానికి 1 లక్ష వరకూ పారితోషికాన్ని ఇచ్చారట. 

అలీ రెజా కు సీజన్ మొత్తానికి 6 లక్షలు, సీరియల్ ఫేమస్ హీరో రవికృష్ణకు 8 లక్షలు, యూట్యూబ్ సెన్సేషన్ మహేష్ విట్టా కి కూడా సీజన్ మొత్తానికి 8 లక్షల పారితోషికం అందబోతుందట.బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ లో ముందుంటాడు బాబా భాస్కర్. ఆయనకి సీజన్ మొత్తానికి 10 లక్షల వరకూ అందుతుందట.సీరియల్స్ తో పాటు సినిమాలతో కూడా పాపులర్ అయిన హిమజా రెడ్డి కు కూడా సీజన్ మొత్తానికి 12 లక్షల వరకూ అందబోతుందట.వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మాజీ యాంకర్ శిల్పా చక్రవర్తి కు 2 లక్షల వరకూ రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే కంటెస్టెంట్స్ కు 'బిగ్' బాస్ తో ఫేమ్ మాత్రమే కాదు డబ్బులు కూడా భారీగానే వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది..!

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

   13 hours ago


జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

   18 hours ago


ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

   18 hours ago


బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   24-05-2020


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle