బిగ్ బాస్-3 రచ్చ..నాగార్జున ఇంటి ముట్టడి
20-07-201920-07-2019 13:25:48 IST
Updated On 20-07-2019 14:26:44 ISTUpdated On 20-07-20192019-07-20T07:55:48.836Z20-07-2019 2019-07-20T07:55:47.105Z - 2019-07-20T08:56:44.131Z - 20-07-2019

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3పై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఓయూ విద్యార్దులు ఆ షో హోస్ట్ నాగార్జున నివాసాన్ని ముట్టడించారు. రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లు కోర్టులో కేసులు కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలోనే ఉస్మానియా విద్యార్ధులు షో నిలిపివేయాలని, లేకుంటే నాగార్జున ఇంటిని, అన్నపూర్ణ స్టూడియోని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అందులో భాగంగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 3 ఆదివారం నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థులు బిగ్‌బాస్ షోను ఆపాలని వత్తిడి తెస్తున్నారు. అయితే వీటిని పట్టించుకోకుండా షో నిర్వాహకులు బిగ్‌బాస్‌ను ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో కందుల మధు ఆధ్వర్యంలో నాగార్జున ఇంటిని ముట్టడించారు ఓయూ విద్యార్థులు.
‘బిగ్‌బాస్ 3’ వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదని.. మహిళలను కించపరిచే షో కి నాగార్జున ఏ రకంగా హోస్ట్ గా ఉంటారని వారు ప్రశ్నించారు.
తెలంగాణలో మహిళలను కించపరిచే, వేధించే బిగ్ బాస్ లాంటి షో లను విద్యార్థులు వ్యతిరేకించాలని, మహిళలు ఈ షోని చూడవద్దని వారు కోరారు. నినాదాలు చేస్తూ నాగార్జున నివాసం ముందు ఆందోళనకు దిగారు.
దీంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఢిల్లీలో ధర్నా నిర్వహించిన శ్వేతారెడ్డి, గాయత్తిగుప్తా
ఢిల్లీకి చేరిన తెలుగు బిగ్ బాస్-3 లొల్లి

వైజాగ్‌లో ఆర్ఆర్ఆర్ టీం:వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు
9 hours ago

శ్రీముఖి, రాహుల్ కలిసిపోయారా? పార్టీలో ఫుల్ ఖుషీ
18 hours ago

ఫ్యాన్స్‌కి కాజల్ షాక్.. చందమామ లవ్‌లో పడిందా?
19 hours ago

సరిలేరు నీకెవ్వరు....సూర్యుడివో చంద్రుడివో పాట వచ్చేసింది
09-12-2019

అభిమాని కుటుంబానికి భారీ సాయం చేసిన రామ్ చరణ్..
09-12-2019

దుమ్మురేపుతున్న డిస్కోరాజా టీజర్.. 7 మిలియన్ వ్యూస్
09-12-2019

వెంకీ మామ సినిమా స్టోరీ ఇదేనా..?
09-12-2019

బంపర్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్..
09-12-2019

'బిగ్ బాస్'కి మరోసారి ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ
09-12-2019

సమంతా అలా ఉన్నావేంటి?
09-12-2019
ఇంకా