newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

బిగ్ బాస్ 3 : అప్పుడు కౌశల్ ... ఇప్పుడు రాహుల్

21-08-201921-08-2019 15:44:49 IST
2019-08-21T10:14:49.116Z21-08-2019 2019-08-21T10:14:47.505Z - - 20-09-2019

బిగ్ బాస్ 3 : అప్పుడు కౌశల్ ... ఇప్పుడు రాహుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మూడోవారం నుంచి తన గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. హౌస్ లో ఎంతమంది అణకదొక్కాలని చూసినా ఉప్పెంగే కెరటంలా పైకి ఎగిసి పడ్డాడు. సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. 'బిగ్ బాస్' సీజన్ లో  ఇదే స్థితిలో రాహుల్ ఉన్నాడా..? 

రాహుల్ కూడా మరో కౌషల్ కానున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తన వాళ్లు అనుకున్నవాళ్లే మోసం చేసి నామినేట్ చేసారు అనే ఉద్దేశంతో ప్రస్తుతం రాహుల్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చూసినా నవ్వుతూ గేమ్ ఆడుతాడని, గేమ్ ను లైట్ గా తీసుకుంటాడని...బద్దకంగా ఉంటాడని రాహుల్ ను విమర్శించిన హౌస్ మేట్స్ అందరూ కూడా రాహుల్ కే సలహాలు ఇస్తున్నారు. గేమ్ ఎలా ఆడాలో చెప్తున్నారు. ముఖ్యంగా టాస్క్ ఆడేటపుడు అసలు పెర్ఫామెన్స్  లేదని నామినేట్ చేసారు. హౌస్ లో 8మంది ఈసారి రాహుల్ ని నామినేట్ చేసారు.  శ్రీముఖి కూడా సీజన్ మొత్తం నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేస్తానని ముఖంపైనే చెప్పేసింది. 

 నాగార్జున కూడా ఎవరివీ చూపించని వీడియోలు రాహుల్ వే చూపించారు. నిజానికి అలీ రైజా, అషూ కూడా బ్యాక్ టాకింగ్ చాలా చేసారు. కానీ, వాటిని చూపించలేదు. కేవలం రాహుల్ మాట్లాడింది మాత్రమే చూపించారు. అప్పట్నుంచి శ్రీముఖి ఓపీనియనే మారిపోయింది. దాంతో రాహుల్ కు సపోర్ట్ చేసే వారు హౌస్ లో లేకపోవడం దారుణంగా ఉంది. అలీ రెజా తనను నామినేట్ చేశాడని బాధపడుతున్న బాబా భాస్కర్ తో "మిమ్మల్ని కేవలం ఒకే ఒక్కడు చేసాడు సార్.. నెలరోజులు మీ పక్కనే తిరిగిన అతను చేస్తేనే మీకు బాధేస్తే,, మరి నన్ను నా ఫ్రెండ్స్ ముగ్గురు నామినేట్ చేసారు. 

హౌస్ లో 8మంది చేసారు నేనెంత బాధపడాలి" అని రాహుల్ చెప్పడం అందరిని బాధకు గురి చేసింది. నవ్వుతూ ఉండటం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. కానీ నా నవ్వును కూడా వీరు తప్పు పడుతున్నారు. లైట్ తీసుకోమని బాబా భాస్కర్ ను ఊరడించాడు. దీంతో రాహుల్ కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పటికైనా రాహుల్  గేమ్ విషయంలో స్ట్రాటజీని అప్లై చేయాలనీ ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..!

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle