newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

బిగ్ బాస్ ఫేం సంజన కంప్లైంట్.. మాజీ ఎమ్మెల్యే కొడుక్కి చిక్కులు

01-12-201901-12-2019 18:14:53 IST
2019-12-01T12:44:53.270Z01-12-2019 2019-12-01T12:44:48.090Z - - 06-12-2019

బిగ్ బాస్ ఫేం సంజన కంప్లైంట్.. మాజీ ఎమ్మెల్యే కొడుక్కి చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బిగ్ బాస్ సంజన గుర్తుందా? ఇప్పుడామె వార్తల్లోకి వచ్చింది. పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కంప్లైంట్ చేసింది. దీంతో పొలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు. మద్యం బాటిళ్లతో ఆశిష్ తనపై దాడికి దిగాడని ఆమె ఫిర్యాదులో వివరించింది.

తన బౌన్సర్లు దగ్గరున్నా ఏమీ అనలేదని, అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఆశిష్ గౌడ్ రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి పబ్బులో అమ్మాయిలను చితకబాది అడ్డువచ్చిన వారిపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది.

హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. హోటల్ నుంచి బయటకు వచ్చి రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉంది. ఈ సమయంలో ఆశీష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పోలీసులకు వివరించింది.

తనను వేధిస్తున్నా.. అక్కడున్నవారు ఎవరూ తనను కాపాడే ప్రయత్నం చేయలేదని సంజన పేర్కొంది. హోటల్ యాజమాన్యం కూడా స్పందించకపోవడం దారుణం అని ఫిర్యాదులో వెల్లడించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను చూస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్సై వెంకటరెడ్డి చెప్పారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle