newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

'బాహుబలి-2' రికార్డును దాటేసిన 'సైరా'

20-09-201920-09-2019 12:36:06 IST
Updated On 20-09-2019 16:13:58 ISTUpdated On 20-09-20192019-09-20T07:06:06.955Z20-09-2019 2019-09-20T06:50:56.599Z - 2019-09-20T10:43:58.012Z - 20-09-2019

 'బాహుబలి-2' రికార్డును దాటేసిన 'సైరా'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మెగా అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా'. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ పట్టేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు 112 కోట్లకు పైగా బిజినెస్ జరగడంతో ట్రేడ్ వర్గాలు మాత్రమే గాక సినీ వర్గాలు షాక్ లో ఉన్నాయి. వసూళ్ల పరంగా ఈ సినిమా సృష్టించనున్న రికార్డులను గురించిన చర్చలు అప్పుడే మొదలైపోయాయి. 

ఈ సందర్భంలో ఈ సినిమా 'బాహుబలి-2' రికార్డు దాటిపోవడం విశేషం. ఈ సినిమా శాటిలైట్ హక్కుల బిజినెస్ లో 'బాహుబలి-2' రికార్డు దాటేసింది. 'సైరా' అన్ని భాషల శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులను జీటీవీ సొంతం చేసుకుంది. ఇందుకుగాను 125 కోట్లను జీటీవీ చెల్లించినట్టు సమాచారం. 'బాహుబలి-2' శాటిలైట్ హక్కులు 114 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి ఇమేజ్ ఇంకా చెక్కు చెదరలేదంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  

తమిళంలో థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఈ హక్కులకు గాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు కొణిదెలకు భారి మొత్తం చెల్లించారని సమాచారం. అన్నీ ఏరియాల నుండి ఈ సినిమాకి ఫాన్సీ ఆఫర్స్ రావడం విశేషం.  హిందీలో కూడా వందకోట్లకి పైగానే బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక  ఓవర్సీస్ లో కూడా ప్రముఖ సినిమా సంస్థలు ‘సైరా’ సినిమా విడుదల హక్కుల్ని భారీ ఫ్యాన్సీ రేటుకి  దక్కించుకున్నాయి. 

ఓవర్ ఆల్ గా సినిమా 400 కోట్లకి పైగానే బిజినెస్ జరిగిందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం 45 కోట్లు ఖర్చు పెట్టారని వార్తల నేపథ్యంలో ముందుగా అందరిలోనూ అంత ఖర్చు పెట్టారా? అనే అనుమానం మొదలయింది. ఏ మూలో ఉన్న ఈ అనుమానాలను బ్రేక్ చేస్తూ ట్రైలర్ నిలిచింది. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండనుందని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో వస్తున్న ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle