newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

బాలీవుడ్ ని టాలీవుడ్ ఆక్రమించింది: కంగనా

19-09-202019-09-2020 18:19:39 IST
Updated On 19-09-2020 18:19:27 ISTUpdated On 19-09-20202020-09-19T12:49:39.476Z19-09-2020 2020-09-19T12:48:11.882Z - 2020-09-19T12:49:27.453Z - 19-09-2020

బాలీవుడ్ ని టాలీవుడ్ ఆక్రమించింది: కంగనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే అతి పెద్ద ఫిలింసిటీని నిర్మించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారట.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధనగర్ జిల్లా నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని సీఎం అధికారులను కోరారు. గౌతంబుద్ధనగర్, మీరట్, ఘజియాబాద్, బులంద్ షహర్, హాపూర్, బాగ్ పత్ ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం యోగి అధికారులతో సమీక్షించారు.

యూపీ సీనియర్ అధికారులు, కేంద్ర సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, యూపీ ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గార్గ్, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులో సీఎం ఆదిత్యనాథ్ మాట్లాడారు. గౌతమబుద్ధ నగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్లు సీఎం యోగి ప్రకటించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో స్థలాన్ని చూసి ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.మీరట్ మెట్రో ప్రాజెక్టును 2025 మార్చిలోగా పూర్తి చేయాలని సీఎం కోరారు. 

కాగా ఈ వార్త పై స్పందించింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్. భారతదేశంలోని అన్ని చిత్రపరిశ్రమల్లోనూ బాలీవుడ్ పెద్దదని అందరూ అనుకుంటారని, అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఆ స్థానాన్ని ఆక్రమించిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ తాజాగా  చెప్పడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. 

ఈ ప్రకటనపై కంగన స్పందిస్తూ ఈ దేశంలో నెంబర్ వన్ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. అయితే అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది. పాన్ఇండియా సినిమాలను తరచుగా నిర్మిస్తోంది. ఎన్నో హిందీ సినిమాలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్‌లు జరుపుకుంటాయి. యోగీ ఆదిత్యానాథ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకురావాలి. అన్ని చిత్ర పరిశ్రమలు కలిసి ఓకే `భారతీయ చలనచిత్ర పరిశ్రమ`గా ఏర్పడాలి. మనం ఇలా విడిపోవడం వల్ల హాలీవుడ్ లాభపడుతోంద`ని కంగన ట్వీట్లు చేయడం విశేషం. 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle