newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

బాలీవుడ్ టు హాలీవుడ్

12-08-201912-08-2019 15:22:16 IST
Updated On 12-08-2019 15:28:21 ISTUpdated On 12-08-20192019-08-12T09:52:16.418Z12-08-2019 2019-08-12T09:52:11.957Z - 2019-08-12T09:58:21.031Z - 12-08-2019

బాలీవుడ్ టు హాలీవుడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆమె మోడల్.. మాజీ ప్రపంచసుందరి.. నటి. బాలీవుడ్ తో ఆమె సినీ జీవితం ప్రారంభమై హాలీవుడ్ వరకు వ్యాపించింది. అందుకే ఈ భామకు గ్లోబల్ స్టార్ బిరుదును కూడా ఇచ్చారు. ఆమె ఎవరో మీకు అర్థమయి ఉంటుంది. ఆమె ప్రియాంక చోప్రా. తన తోటి నటులతో ఎంతో స్నేహభావంతో మెలుగుతూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది ఈ సుందరి. సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు మోడల్ గా రాణించింది. అంతేకాదు 2000సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది ఈ స్టార్ నటి.

జూలై 18 1982న జార్ఖండ్ లోని జమ్ షెడ్ పూర్ లో జన్మించింది. ప్రియాంక తల్లిదండ్రులు డాక్టర్స్. మోడల్ కావటం వల్ల ప్రియాంక యాక్టింగ్ వైపు మొగ్గు చూపింది. ఆమె కెరియర్ బాలీవుడ్ తో స్టార్ట్ కాలేదు. 2002వ సంవత్సరంలో తమిళన్ అనే తమిళ చిత్రంతో తన నటన జీవితాన్ని మొదలు పెట్టింది. 2003లో ప్రియాంక బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తిరుగులేని నటిగా నిరూపించుకుంది. ప్రియాంక నటే కాదు..మంచి గాయని కూడా. 

ప్రియాంక ఖాతాలో ఎన్నో అవార్డులు ఉన్నాయి. ఫిలింఫేర్ అవార్డ్స్..నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్..పద్మ శ్రీ అవార్డును ఈమెను వరించాయి. ఇవే కాదు బాలల విద్య..సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రియాంక యునిసెఫ్ అవార్డుని కూడా అందుకుంది.  ప్రియాంక చేస్తున్న సేవకు తగిన గుర్తింపుగా యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగా నియమితురాలయింది. మరి ఇంతటి గౌరవం మన నటీమణుల్లో ఈమెకి దక్కడం మన అందరికి గర్వకారణమే. 

కేన్స్ లో జరిగే చలన చిత్రోత్సవ వేడుకల్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటుంది ప్రియాంక. ఈ కేన్స్ ఉత్సవాల్లోనే అమెరికన్ గాయకుడు.. రచయిత.. నటుడు నిక్ జొనస్ తో పెళ్లి కాకముందు..పెళ్లి అయిన తర్వాత దంపతులుగా పాల్గొనే అవకాశం ప్రియాంకకే దక్కిందని చెప్పుకోవాలి. నిక్..ప్రియాంక కంటే పదమూడేళ్లు చిన్నవాడు. అయినప్పటికి వారి ప్రేమకి వయస్సు అడ్డం కాలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు ఈ జంట. నిక్  పూర్తి పేరు నికొలస్ జేరీ జొనస్. ఆయన తన ఏడవ ఏట నుంచే నటనని ప్రారంభించాడు నిక్. తన కంటే చిన్నవయసువాడిని చేసుకున్నందుకు వచ్చిన విమర్శలన్నింటినీ ధీటుగా ఎదుర్కొంది ప్రియాంక. మొత్తానికి ఈ బాలీవుడ్ సుందరి హాలీవుడ్ కోడలుగా మారింది. 

ఒక్కసారి సెలబ్రీటి అయ్యాక పొగడ్తలతో పాటు విమర్శలు వస్తూనే ఉంటాయి. రోమ్ వెళ్లితే రోమన్ లా ఉండాలన్న తీరుని ప్రియాంక అక్షరాలా పాటిస్తుంది. దానికి ఉదాహరనే ఆమె వేసుకుంటున్న డ్రెస్సులు..బికినీలు. వివాహానంతరం ప్రియాంక  వేసుకుంటున్న  డ్రెస్సులపై ట్రోల్స్ కి ఎక్కువగా గురైయింది. అయినా వీటన్నింటినీ పట్టించుకునే తీరిక ప్రియాంకకి ఉందా..ఉన్నా కూడా లైట్ తీసుకునే మనస్తత్వం ఈమెది.

ఇటు బాలీవుడ్ చిత్రాలు..అటు హాలీవుడ్ మూవీలతో రెండు చేతులా సంపాదించే ప్రియాంకకి అదనంగా  సంపాదించేందుకు మూడవ చెయ్యి కూడా ఉందండోయ్. ఎలా అనుకుంటున్నారా యాడ్స్ రూపంలో. ఈ భామకు తన ఇన్ స్టాగ్రామ్ లో నాలుగు కోట్లపైనే ఫాలోవర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవాలి ఈ బ్యూటీకి  ఉన్న క్రేజ్ ఏంటో.  ఎటువంటి ఫోటోని పోస్ట్ చేసినా సరే క్షణాల్లో లక్షల కొద్ది లైక్స్..కామెంట్స్ వచ్చేస్తుంటాయి. ఆ క్రేజ్ ని  క్యాష్ గా మార్చుకుంది ప్రియాంక. పలు బ్రాండ్లకు చెందిన వస్తువులను తన ఇన్ స్టా గ్రామ్ లో ప్రమోట్ చేస్తూ ఒక్కో పోస్ట్ కి రూ.1.86కోట్లను రాబట్టుకుంటుంది ఈ హాలీవుడ్ కోడలు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే. ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లతో ప్రపంచంలో అధికంగా సంపాదిస్తున్న వారిలో ప్రియాంక 19వ స్థానంలో ఉంది. ఎంతయినా ఓ భారత స్త్రీకి ఇంతటి బ్యాక్ గ్రౌండ్  ఉండటం ఆనందించాల్సిన విషయమే. ప్రియాంక ఇంకా అంచెలంచెలుగా తను కోరుకుంటోన్న రంగంలో ఎదగాలని కోరుకుందాం. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle