newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

బాలయ్య లుక్ అదిరింది... మీరు చూస్తే షాకే!

21-01-202021-01-2020 08:27:43 IST
2020-01-21T02:57:43.136Z21-01-2020 2020-01-21T02:57:39.137Z - - 26-02-2020

బాలయ్య లుక్ అదిరింది... మీరు చూస్తే షాకే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ మేకప్ తో కనిపించే నందమూరి నటసింహం, హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య లుక్ మారిపోయింది. ఆయన గతంలో ఎప్పుడూ లేనివిధంగా గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. వైట్ అండ్ వైట్ ఖాదీ బట్టల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అదిరిపోయిందంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమా కోసమే బాలయ్య గుండు చేయించుకున్నాడని అంటున్నారు.

ఇదే సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతోంది. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో మూవీకి సంగీతం అందించిన తమన్ ఈ మూవీకి పనిచేయడంతో అటు పాటలు, మ్యూజిక్ కూడా గతంలో బాలయ్య మూవీలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. 

బాలకృష్ణ సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ద్వారక్ క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు. ఇక గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలు అంచనాలను చేరుకోలేదు. దీంతో బాలయ్య కూడా ఈ మూవీని ఛాలెంజింగ్ గా తీసుకుని పనిచేస్తున్నాడు. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రానుండడంతో అంచనాలు భారీగా వున్నాయి. బోయపాటి తల్లి హఠాన్మరణం చెందడంతో అంతిమ సంస్కారాలన్నీ పూర్తయ్యాక షూటింగ్ కి ప్లాన్ చేయనున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle