newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

బాలయ్య మూవీకి పవర్ ఫుల్ టైటిల్

29-06-202029-06-2020 12:18:13 IST
Updated On 29-06-2020 12:23:09 ISTUpdated On 29-06-20202020-06-29T06:48:13.858Z29-06-2020 2020-06-29T06:39:43.808Z - 2020-06-29T06:53:09.978Z - 29-06-2020

బాలయ్య మూవీకి పవర్ ఫుల్ టైటిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నందమూరి నటసింహం బాలయ్య బాబు మూవీస్ అంటే పవర్ ఫుల్ డైలాగులు వుంటాయి. అంతేకాదు, టైటిల్ కూడా అలాగే వుంటుంది. అందులోనూ బోయపాటి శ్రీను దర్శకత్వం అంటే అదో రేంజ్. చాలాకాలం తరవాత బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే సినిమాపై అభిమానులకు ఎన్నో అంచనాలు వున్నాయి, 

ఈ సినిమా టైటిల్ కూడా అదిరిపోయే విధంగా ఉండాలని భావించారు  ఫ్యాన్స్. గతంలో లెజెండ్, సింహా వంటి టైటిల్స్ తో వీరి కాంబినేషన్ లో వచ్చిన మూవీలు దుమ్మురేపాయి. అదే రేంజ్, అదే క్రేజ్ ఇప్పుడు కూడా వుంది.  ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ని ఫైనల్ చేశారట. కథకు ఈ టైటిల్ బాగా సరిపోతుందని మూవీ యూనిట్ అంతా సంతృప్తి చెందింది. దీంతో దీనిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే ఎప్పుడూ బాలయ్యపై నెగిటివ్ కామెంట్లు చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన స్టైల్ మార్చాడు. ఈమధ్య 60వ బర్త్ డే చేసుకున్న బాలకృష్ణ క్రేజ్ కి వర్మ ఫిదా అయ్యాడు. అంతేకాదు, బాలయ్య బర్త్ డే కానుకగా శివ శంకరీ పాటను అభిమానులకు ఇచ్చాడు. బాలయ్యే పాడిన ఆ పాట తెగ వైరల్ అయింది. నెగెటివ్ కామెంట్లతో శివ శంకరీ పాట మార్మోగిపోయింది.

మళ్లీ ఆ పాట, బాలయ్య గాత్రంపై ఆర్జీవీ సెటైర్స్ వేశాడు.బాలయ్య పాటపై ఆర్జీవీ రియాక్షన్ అప్పట్లో తెగ వైరల్ అయింది. స్పందించాడు. ‘వావ్ మహమ్మద్ రఫీ, ఎస్పీబీ కూడా పాడటంలో జూనియర్లే. ఆయన పాడి పాట, ఆ స్వరాల, ఆ శబ్దాలు వింటే శ్రోతల హృదయ స్పందన పెరుగుతుంది. ఒతెల్లో బల్లాడ్ శంకర శాస్త్రి మోజార్ట్‌ల కలయికలా ఉంద'ని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పాట విని స్వర్గంలోని ఎన్టీయార్ కూడా సంతోషంతో గంతులు వేస్తుంటారని ట్వీట్ చేశాడు వర్మ. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle