newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

బాలయ్య-బోయపాటి మూవీ... ఇరగదీసిన నటసింహం

10-06-202010-06-2020 08:05:27 IST
2020-06-10T02:35:27.240Z10-06-2020 2020-06-10T02:35:18.454Z - - 13-07-2020

బాలయ్య-బోయపాటి మూవీ... ఇరగదీసిన నటసింహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ నందమూరి నటసింహం బాలయ్యబాబు పుట్టినరోజు. ఆయన అభిమానులకు ఫుల్ కిక్కిచ్చారు దర్శకుడు బోయపాటి.  బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది బాలయ్య 106వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు ఈ మూవీకి.  తాజాగా బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు బాలయ్య. జూన్ 10న తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ టీజర్‌ను అభిమానులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బోయపాటి, బాలయ్య కాంబో అంటే అంచనాలు మామూలుగా వుండవు.

ఈ సినిమా ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని టీజర్ చూసి అర్థం చేసుకోవచ్చు. బాలయ్య పంచెకట్టులో కొత్త లుక్‌తో  అదరగొట్టారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కుమ్మేశారు.  బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రం ఈరోజు మరిచిపోలేని రోజనే చెప్పాలి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ సంగతి తేలలేదు. 

‘‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి.. శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.  ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి.

Image

ఇదే టైటిల్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారని అన్నారు. కానీ, అంతకు మించిన ట్రీట్‌తో బాలయ్య అభిమానులను కట్టిపడేశారు బోయపాటి శ్రీను. రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన పోరాట సన్నివేశాన్నే టీజర్‌గా అందించారు. ఈ సినిమాకు రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

మరోవైపు బాలయ్యకు అభిమానుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా అదిరిపోతోంది. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా సూపర్బ్ అంటూ ట్వీట్ చేశారు. మరో హీరో నారా రోహిత్ మావయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇరగదీశారంటూ ట్వీట్ చేశారు.

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   14 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   21 hours ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle