newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న ‘భారత్’

12-06-201912-06-2019 06:58:08 IST
2019-06-12T01:28:08.678Z12-06-2019 2019-06-12T01:27:58.980Z - - 26-06-2019

బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న ‘భారత్’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు పవిత్రమైన పండగ 'ఈద్'కు విడదీయరాని బంధం ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుండి ప్రతి రంజాన్ పండగ సందర్బంగా సల్మాన్ తన సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఈద్ పండుగ కానుకగా సల్మాన్ నటించిన 'భారత్' సినిమాని విడుదల చేశారు. సల్మాన్ ఐదు డిఫరెంట్ గెటప్స్ లో నటించిన ఈ చిత్రంలో టబు, జాకీ ష్రఫ్ ప్రధాన పాత్రలో నటించగా కత్రినా కైఫ్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. 

భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కొరియన్ మూవీ 'ఓడే టూ మై ఫాదర్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం జూన్ 5న విడుదలయింది. మొదటి ఆట నుండే సూపర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా నాలుగు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. మరో రెండు రోజులకే 150 కోట్ల క్లబ్ లో చేరి ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 

 ఆరు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి చూస్తే... 

 5/6/19- బుధవారం: 42.30 కోట్లు 

 6/6/19- గురువారం- 31.00 కోట్లు 

 7/6/19- శుక్రవారం- 22.20 కోట్లు 

 8/6/19- శనివారం- 26.70 కోట్లు 

 9/6/19- ఆదివారం- 27.90 కోట్లు 

 10/6/19- సోమవారం- 9. 20 కోట్లు 

మొత్తం వసూళ్ళు: 159.30 కోట్లు 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle