facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

బన్నీ లుక్ మార్చేశాడు... సీక్రెట్ ఏంటో?

13-03-201913-03-2019 13:36:34 IST
2019-03-13T08:06:34.631Z13-03-2019 2019-03-13T08:06:27.275Z - - 18-03-2019

బన్నీ లుక్ మార్చేశాడు... సీక్రెట్ ఏంటో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ ఒకే లుక్‌తో కనిపిస్తే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే హీరోలు సైతం అభిమానుల అభిరుచులకు అనుగుణంగా తమ లైఫ్ స్టయిల్ మార్చేసుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే అతను ప్రతి సినిమాకూ లుక్ మార్చేస్తాడు. ఒక్కోసారి వెరైటీ హెయిర్ స్టయిల్‌తో కనిపిస్తాడు. ‘దువ్వాడ జగన్నాథం’లో సగటు బ్రాహ్మణ కుర్రాడిలా కనిపించాడు.

అనంతరం ‘నా పేరు సూర్య’ కోసం పూర్తిగా అవతారం మార్చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం మళ్లీ లుక్ మార్చుకునే పనిలో పడ్డాడని టాక్. ఈ మూవీ కోసం బన్నీ కసరత్తులు చేస్తున్నాడు.

గత రెండు నెలలుగా ఇదే పనిలో ఉన్న బన్నీ.. కొన్ని రోజులుగా బయట కనిపించడంలేదు. తాజాగా ఆర్య పెళ్లిలో.. అలాగే భార్యతో కలిసి మరో పార్టీలో పాల్గొన్నాడు. ఆర్య పెళ్లిలో బన్నీ చాలా వరకు తన లుక్ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఐతే స్నేహతో పాటుగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మితతో కలిపి పాల్గొన్న పార్టీలో మాత్రం బన్నీలో వచ్చిన మార్పు బయటపడింది.

జుట్టు బాగా పెంచి.. సాఫ్ట్ చేయించి.. కుడివైపు నుంచి పాపిట తీయించి కొత్తగా తయారయ్యాడు బన్నీ. ముఖంలో కూడా మార్పు కనిపించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  బన్నీ సాఫ్ట్ లుక్‌ వైరల్ అవుతోంది. మొత్తంమీద బన్నీ నయా లుక్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. లుక్ లాగే ఈ మూవీకూడా సూపర్‌గా ఉంటుందేమో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle