newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

బన్నీ మూవీలో టబు...?

15-04-201915-04-2019 08:19:47 IST
Updated On 15-04-2019 08:19:44 ISTUpdated On 15-04-20192019-04-15T02:49:47.451Z15-04-2019 2019-04-15T02:48:53.535Z - 2019-04-15T02:49:44.302Z - 15-04-2019

బన్నీ మూవీలో టబు...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించే సినిమా పూజ కార్యక్రమాలు ఘనంగా ఏప్రిల్ 13న జరిగాయి. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాధాక్రిష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుండి ప్రారంభం కానుంది.

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో షూటింగ్‌కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిలిం వర్గాల్లో కొన్ని వార్తలు ఈ సినిమాపై ప్రచారంలో ఉన్నాయి. వారి కథనం ప్రకారం సినిమాని మలుపు తిప్పే పాత్రలో వెటరన్ నటి 'టబు' నటిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

'నాన్న-నేను' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో యంగ్ హీరోలు ఇద్దరు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కినేని నట వారసుడు సుమంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తోంది. నట కిరీటి రాజేంద్రప్రసాద్ తనయుడిగా ఇన్నోసెంట్ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మరో ప్రధాన పాత్రలో నవదీప్ కూడా నటిస్తున్నారని టాక్. యంగ్ హీరోలతో బాటుగా సునీల్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని సమాచారం. శరవేగంగా షూటింగ్ జరిపి ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయనున్నారు...!


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle