newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

బన్నీ అభిమానులకు పండగే

14-04-201914-04-2019 08:05:20 IST
2019-04-14T02:35:20.340Z14-04-2019 2019-04-14T02:35:08.251Z - - 22-07-2019

బన్నీ అభిమానులకు పండగే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగా అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అల్లు అర్జున్ చిత్రం పూజాకార్యక్రమాలు పూర్తయ్యాయి. 'నా పేరు సూర్య' సినిమా తరువాత బన్నీ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్లు బన్నీ ప్రకటించి చాలా రోజులైనా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఫిలిం నగర్ లో కొన్ని గుసగుసలు వినబడ్డాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ పూజ కార్యక్రమాలు జరిపారు. ఈ పూజ కార్యక్రమాలకు బన్నీ, త్రివిక్రమ్‌తో బాటుగా చిత్ర యూనిట్ పాల్గొంది.

ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక-హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఏ నెల 24 నుండి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా తండ్రి-కొడుకు అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే తండ్రి పాత్ర కోసం సత్యరాజ్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. 

తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో పూజ హెగ్డే..బన్నీతో దువ్వాడ జగన్నాధం, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' లాంటి హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'జులాయి',' సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరి కాంబోలో రానున్న మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి 'నాన్న-నేను' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle