newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

బన్నీకి ఆ కో డైరెక్టర్‌కి గొడవైందా?

20-07-201920-07-2019 14:38:00 IST
2019-07-20T09:08:00.451Z20-07-2019 2019-07-20T09:07:57.209Z - - 23-01-2020

బన్నీకి ఆ కో డైరెక్టర్‌కి గొడవైందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా షూటింగ్ సందర్భంలో సెట్‌లో అల్లు అర్జున్‌, కో డైరెక్టర్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగాయ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బన్నీ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి స‌త్యం కో డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. సినిమా షాట్ రెడీ కాగానే కో డైరక్టర్ స‌త్యం వెళ్లి బ‌న్నీకి చెప్పాడ‌ట‌.

అయితే హీరో అర్జున్ షాట్‌లోకి రాక‌పోయేస‌రికి స‌త్యం రెండు సార్లు బ‌న్నీ వ‌ద్దకు వెళ్లి షాట్ రెడీ అయ్యింద‌ని చెప్పాడ‌ట‌. షాట్‌కి వెళ్లాల్సిన బన్నీ విసుగ్గా సీన్ పేప‌ర్స్‌ను స‌త్యం ముఖం మీద విసిరి కొట్టాడ‌ని సమాచారం. 

దీంతో కో డైరెక్టర్‌కి కోపం వ‌చ్చి సెట్ నుండి వెళ్లిపోయాడు. దాంతో షూటింగ్ ఆగిపోయింద‌ని కూడా సమాచారం. కో డైరెక్టర్ దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేయాలని అనుకున్నారని కానీ చిత్ర యూనిట్ సర్ది చెప్పిందని వార్తలు వినబడుతున్నాయి. 

అయితే ఈ వార్తల‌పై బ‌న్నీ వ‌ర్గం కూడా స్పందించింది. నిజానికి బ‌న్నీ కో డైరెక్టర్ మీద కోపంతో బ‌న్నీ అలా ప్రవ‌ర్తించ‌లేదని ఆయ‌న వ్యక్తిగ‌తంగా ఓచోట‌కి వెళ్లాల్సి రావడంతో ఓ చోట షూటింగ్ కార‌ణంగా మీటింగ్ కేన్సిల్ చేసుకున్నాడ‌ట‌. పోనీ షూటింగ్ కంటిన్యూ చేద్దామ‌నుకుంటే.. కో డైరెక్టర్ వ‌చ్చి త‌దుప‌రి షెడ్యూల్‌కు గ్యాప్ ఉంటుంద‌ని చెప్పడ‌ంతో బ‌న్నీ అప్‌సెట్ అయ్యాడ‌ట‌.

అయితే కో డైరెక్ట‌ర్ స‌రైన స‌మ‌యంలో ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఇవ్వక‌పోవ‌డం వ‌ల్లే త‌న ప్లాన్ పాడైంద‌ని బ‌న్నీ భావించాడ‌ట‌. అలాగే షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యింద‌నే మాట నిజం కాద‌ని.. ఆ స‌న్నివేశంలో బ‌న్నీతో న‌టించాల్సిన సీనియ‌ర్ యాక్టర్ మ‌రో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌టంతో షూటింగ్‌ను ఆపార‌ని కూడా తెలియ‌జేశారు. కానీ సినీ పెద్దల జోక్యంతో ఈ సమస్య సమసిపోయిందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle