newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

బంపర్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్..

09-12-201909-12-2019 15:16:23 IST
2019-12-09T09:46:23.040Z09-12-2019 2019-12-09T09:46:18.860Z - - 24-01-2020

బంపర్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కామెడీ షో 'జబర్దస్త్' తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటి రష్మీ గౌతమ్. ఈ భామ అడపాదడపా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 'గుంటూరు టాకీస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మీ అక్కడ మాత్రం హిట్ కొట్టలేక పోయింది. తాజాగా ఈ భామ బాలయ్య  బాబు సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు ఫిలిం వర్గాలలో వినబడుతున్నాయి.

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి శ్రీనివాస్ బాలయ్యబాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసంట్ గా ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఓపెనింగ్ షాట్ లోనే బాలయ్యబాబు ‘నువ్వొక మాటంటే అది శబ్దం...అదే మాట నేనంటే శాసనం’’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ని కూడా చెప్పాడు.

దీన్ని బట్టీ వీళ్లిద్దరి కాంబోలో మరోసారి మాస్‌-మసాలా సినిమా రాబోతోందని అర్ధం అవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కీర్తి సురేష్ కూడా ఓకె చెప్పిందని ఫిలిం వర్గాల సమాచారం. రెండో హీరోయిన్ గా కన్నడ భామ రుచిత రామ్ నటిస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ కోసం చిత్ర యూనిట్ చూస్తోంది. సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో గత కొద్దీ రోజులుగా చిత్ర యూనిట్ అన్వేషణలో ఉంది. రోజా, వాణి విశ్వనాధ్ లను కూడా చిత్ర యూనిట్ సంప్రదించింది. వేరే కారణాల వల్ల ఈ సినిమాకి వారు నో చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆ పాత్ర కోసం యాంకర్‌ రష్మిని సంప్రదించారట బోయపాటి.

ఇప్పటి వరకు  గ్లామరస్‌ పాత్రల్లో మెప్పించిన రష్మీ సినిమాలో కథను కీలక మలుపుతిప్పే పాత్రతో పాటు, గ్లామర్‌గా కనిపించాల్సి ఉండటంతో ఆమే హ్యాపీగా ఈ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు, సినిమాలో హవీ స్టార్ కాస్టింగ్ ని కూడా ప్లాన్ చేసాడట బోయపాటి.

రష్మి బాలయ్యబాబు జోడీ ఎలా ఉండబోతోందో అని ఇప్పట్నుంచే నందమూరి అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం రత్నం మాటలు సమకూరుస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరిపి సమ్మర్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle