newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

బందోబస్త్ మూవీ రివ్యూ

20-09-201920-09-2019 18:10:45 IST
Updated On 21-09-2019 14:37:07 ISTUpdated On 21-09-20192019-09-20T12:40:45.213Z20-09-2019 2019-09-20T12:40:42.685Z - 2019-09-21T09:07:07.603Z - 21-09-2019

బందోబస్త్ మూవీ రివ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'రంగం' సినిమా ఫేమ్ కెవి ఆనంద్ దర్శకత్వంలో మోహన్ లాల్, సూర్య నటించిన పొలిటికల్ డ్రామా 'బందోబస్త్'. ఆర్య, సయేశా సైగల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా సంగతి ఏంటో తెలియాలంటే సినిమా సమీక్ష లోకి వెళ్లవలిసిందే. 

కథ 

భారతదేశానికి ప్రధానమంత్రి చంద్రకాంత్ వర్మ( మోహన్ లాల్) దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవికిషోర్ (సూర్య) నియమించబడతాడు. ప్రజల కోసం నిరంతరం తపించే ప్రధాని కోసం రవికిషోర్ రక్షణ గోడగా ఉంటాడు. ఈ సమయంలో రవికిషోర్.. 

అంజలి (సయేషా సైగల్) ప్రేమలో పడతాడు. కానీ అనూహ్యంగా ప్రదానమంత్రిని ఉగ్రవాదులు చంపేస్తారు. అసలు ప్రదానమంత్రిని చంపింది ఎవరు..? ఈ హత్య కేసును రవికిషోర్ సాల్వ్ చేశాడా? చంద్రకాంత్ వర్మ తర్వాత ప్రధాని ఎవరు? వంటి ప్రశ్నలకు సమాదానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.      

ప్లస్ పాయింట్స్ 

సూర్య యాక్టింగ్ సినిమాకి ప్లస్ పాయింట్. ప్రదానమంత్రి హత్య, దాని చుట్టూ విచారణ జరిపే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. అదే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే థియేటర్స్ లో ఆడియన్స్ ని కట్టిపారేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ , క్లైమాక్స్ సినిమాని నిలబెట్టాయనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. మోహన్ లాల్ స్క్రీన్ టైం తక్కువైనా తన నటనతో ఆకట్టుకున్నాడు. బొమన్ ఇరానీ, ఆర్య, సయేశా సైగల్ చక్కని నటన కనబరిచారు. హరీష్ జైరాజ్ నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాని మరో రేంజ్ కు తీసుకువెళ్లాయి. 

మైనస్ పాయింట్స్ 

సస్పెన్స్ మూవీ గ్రిప్పింగ్ గా ఉంటేనే ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. ఇంట్రస్టింగ్ సీన్స్ లేకపోవడం వల్ల నత్తనడక నడిచిందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ సినిమా చాలా స్లోగా సాగుతుంది. ఎవరికి వారే చక్కని నటన కనబరిచినా సెకండ్ హాఫ్ లాగింగ్ ఉండటంతో క్యూరియాసిటీ కోల్పోతాడు. పొలిటికల్ హై డ్రామా యాక్షన్ సీన్స్ బాగా తీసిన సినిమాలో ట్విస్ట్ లు లేకపోవడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్స్ మద్యలో సాదాసీదాగా వెళ్లే సీన్స్ అంత ఆకట్టుకోలేదు. ఇలాంటి మూవీస్ కి రన్ టైం తక్కువ ఉండాలి. కానీ సినిమా నిడివి 165 నిముషాలు ఉండటంతో అనవసరపు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. 

ఓవరాల్‌గా పొలిటికల్ యాక్షన్ మూవీలు చూసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అందులోనూ సూర్య ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డిస్సపాయింట్ అవ్వరు.

రేటింగ్: 2.5/5

నటీనటులు:

సూర్య, సయేషా, మోహన్ లాల్, ఆర్య తదితరులు    

 

సంగీతం: హరీష్ జైరాజ్                    

కెమెరా: ఎం.ఎస్.ప్రభు                                                                                  

దర్శకత్వం: కె.వి.ఆనంద్                            

నిర్మాత: సుభాస్కరన్                                        

విడుదల తేదీ: 20/09/2019  

రన్ టైమ్: 165 నిమిషాలు   

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle