newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్లాస్మా దాతలకు సలాం..... సత్కారం

01-08-202001-08-2020 08:22:58 IST
Updated On 01-08-2020 08:22:57 ISTUpdated On 01-08-20202020-08-01T02:52:58.941Z01-08-2020 2020-08-01T02:51:51.825Z - 2020-08-01T02:52:57.392Z - 01-08-2020

ప్లాస్మా దాతలకు సలాం..... సత్కారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా వచ్చి కోలుకున్నవారు తమ రక్తంలోని ప్లాస్మాను దానం చేసి రోగులు కోలుకునేలా ఎంతో సాయం చేస్తున్నారు. తాజాగా  ప్లాస్మా దాతలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో విజయ్‌దేవరకొండ, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మంది ప్లాస్మాయోధులు/ ప్లాస్మావారియర్స్‌ను సత్కరించారు. అనంతరం ప్లాస్మాదాతలు తమ అభిప్రాయాలు తెలిపారు. 

CP Sajjanar And Vijay Devarakonda Honored Plasma Donaters Hyderabad - Sakshi

''ఇటీవల నా స్నేహితుడి తండ్రికి కరోనా రావడంతో ప్లాస్మా అవసరం వచ్చింది. కరోనా నుంచి కోలుకొని ముందుకొచ్చి ప్లాస్మా దానం చేస్తున్న ప్రతిఒక్కరికీ అభినందనలు. ప్లాస్మాదానం చేయడం ద్వారా బాధితుల కుటుంబాలకు అండగా ఉంటున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నా'' అన్నారు.

ప్లాస్మా దానం చేసి కోవిడ్‌ బాధితులను రక్షించాల్సిన అవసరం ఉందని సినీహీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రస్తుత తరుణంలో ప్లాస్మా దానం  ప్రాముఖ్యతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.  కోవిడ్‌ నుంచి కోలుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేస్తే ఎంతోమంది కోలుకుని తిరిగి సంతోషంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. కరోనా కేసుల కంటే ప్లాస్మా దానాల సంఖ్య పెరగాల్సిన అవసరం వుందన్నారు. ప్లాస్మాదానంపై సైబరాబాద్‌ పోలీసులు చేస్తున్న కృషిని విజయ్ దేవరకొండ ప్రశంసించారు. 

''సైబరాబాద్‌ పరిధిలో రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశాం. సైబరాబాద్‌ పోలీసులు 10 రోజుల్లో 160మందికి ప్లాస్మాను దానం చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయండి. మాదాపూర్‌, బాలానగర్‌లో ఉచిత అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచాం. ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ప్లాస్మాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అన్నారు సీపీ సజ్జనార్. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle