newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

09-08-202009-08-2020 09:06:27 IST
Updated On 09-08-2020 09:09:16 ISTUpdated On 09-08-20202020-08-09T03:36:27.630Z09-08-2020 2020-08-09T03:36:19.353Z - 2020-08-09T03:39:16.636Z - 09-08-2020

ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా శనివారం నుంచి మహేష్ బాబు బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు బర్త్‌డే ట్యాగ్‌ వాడారు. ఇప్పుడది వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.  ఇలాంటి రికార్డ్స్ ఇండియా వైడ్‌గా నమోదు అవుతుండటం ఇప్పటి వరకు జరిగింది. కానీ మహేష్ బాబు అభిమానుల తమ సత్తా ఏమిటో చూపించాలని బాగా ప్రయత్నం చేశారు. 

వారి దెబ్బకు బాక్సాఫీస్ బద్ధలయినట్టుగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవడమే కాకుండా.. వరల్డ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ మహేష్ పేరిట నమోదైంది. మరి ఈ బర్త్‌డే ట్యాగ్ 24 గంటల్లో ఇంకెన్ని రికార్డులు వస్తాయో చూడాలి. మహేష్ అభిమానులు సరిలేరు మీకెవ్వరు అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు చిరంజీవి బాటలో మహేష్ బాబు ముందుకెళుతున్నారు. ప్లాస్మా దానంపై అవగాహన పెంచుతున్నారు.  45వ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. అంతేగాక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమంపై ఆయాన ప్రశంసలు కురిపించారు. ప్లాస్మా దానంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోందన్నారు. 

కరోనా కాలంలో అనుక్షణం ప్రజల భద్రత చూసుకుంటూనే, మరోవైపు ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్న సీపీ సజ్జనార్‌ను కృషిని ఆయన కొనియాడారు.ప్లాస్మా దానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్న తీరు అభినందనీయన్నాడు. తన పుట్టినరోజున అభిమానులంతా కూడా ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే అవకాశం ఉన్నవాళ్లు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశాడు. మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని ట్వీట్ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రక్తదానంతో పాటు ప్లాస్మా దానం గురించి అవగాహన పెంచుతున్న సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle