newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ప్రిన్స్ కోసం ఇద్దరు ఐటెం గర్ల్స్ కావాలట..!

09-10-201909-10-2019 11:48:07 IST
Updated On 09-10-2019 12:41:01 ISTUpdated On 09-10-20192019-10-09T06:18:07.612Z09-10-2019 2019-10-09T06:18:04.441Z - 2019-10-09T07:11:01.480Z - 09-10-2019

ప్రిన్స్ కోసం ఇద్దరు ఐటెం గర్ల్స్ కావాలట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాత సినిమాలలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత లాంటి కొందరు క్లబ్ సాంగ్స్ అనబడే ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు. వాళ్ళు హీరోయిన్స్ గా.. ఇతర పాత్రలలో చేసినా వాళ్ళని అలా చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడేవారు. వాళ్ళు కూడా అందుకు తగ్గట్లే అలరిస్తూ గట్టిగా సొమ్ము చేసుకొనేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసేస్తున్నారు.

కాకపోతే ఐటెం సాంగ్స్ అనే పదం మార్చి స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. ఇందుకు బాలీవుడ్ లో ఐశ్వర్య, కరీనా లాంటి వాళ్ళ దగ్గర నుండి మన టాలీవుడ్ లో కాజల్, తమన్నా, శృతి లాంటి వాళ్ళ వరకు అందరూ ఈ స్పెషల్ సాంగ్స్ కోసం తెగ ముందుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే చేసేది నాలుగు నిమిషాల పాట. కానీ తీసుకొనేది మాత్రం ఓ చిన్న సినిమా బడ్జెట్ అంత.

పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తుండడంతో ఈ స్పెషల్ సాంగ్స్ మీద మన హీరోయిన్స్ తెగ మనసుపారేసుకుంటున్నారు. మన దర్శకులు కూడా స్టార్ హీరోల సినిమాలలో ఖచ్చితంగా ఓ పాట కూడా పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రిన్స్ మహేష్ కోసం ఓ సినిమాలో ఏకంగా రెండు స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారట.

మహర్షి మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న మహేష్ ఎఫ్-2తో స్వింగ్ లోకొచ్చిన అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రష్మిక ఇప్పటివరకు చేసిన సినిమాలలో మూతి ముద్దులైతే ఉన్నాయి కానీ ఆరబోత మాత్రం లేదు.

దీంతో సినిమాకు ఆ తరహా పబ్లిసిటీ కొరవైంది అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు ఈ సినిమాలో డబుల్ స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ముందుగా ఈ సినిమా కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను స్పెషల్ సాంగ్ కోసం ఎంచుకున్నారు. దర్శకుడు అనిల్ కి ఎఫ్-2 తో మిల్కీకి పరిచయముంటే మహేష్ తో ఆగడుతోనే ఆడిపాడింది.

కాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో పాట కోసం చార్మింగ్ బ్యూటీ పూజ హెగ్డేను కూడా ఒకే చేశారట. మహర్షి సినిమాలో పూజ-మహేష్ కెమిస్ట్రీ వర్క్ ఔట్ కారణంగా మరో పాట అనుకోగానే పూజను సంప్రదించారట. అడిగింది మహేష్ కోసం కనుక అమ్మడు కూడా ఒకే చెప్పేసిందట. మరి ఇది ప్రచారంలో భాగమా లేక రష్మిక అందాల లోటును తీర్చేందుకు నిజంగానే ప్లాన్ చేసారో చూద్దాం!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle