newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ప్రభాస్ ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తాడా??

10-09-202010-09-2020 13:10:04 IST
2020-09-10T07:40:04.148Z10-09-2020 2020-09-10T07:40:01.869Z - - 29-09-2020

ప్రభాస్ ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీస్తాడా??
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభాస్.. ప్రస్తుతానికి ఈ పేరు ఒక సెన్సేషన్.. 'బాహుబలి' సినిమా ముందు వరకు ప్రభాస్ కూడా అందరి లాంటి నార్మల్ హీరోనే. అందరిలా కమర్షియల్, లవ్, మాములు బడ్జెట్ సినిమాలు తీసేవాడు. కానీ బాహుబలి సినిమా భారీ బడ్జెట్ తో తీసి అంతకంటే ఎక్కువగా భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో ప్రభాస్ ఒకే సారి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తానికి ఇప్పుడు ప్రభాస్ తెలుసు.

ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ప్రభాస్ కి భారీగానే అభిమానులు ఉన్నారు. ఇదంతా బాహుబలి సినిమా ద్వారా వచ్చిందే. ఈ సినిమా ప్రభాస్ కి తెచ్చి పెట్టిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రభాస్ అభిమానులు బాహుబలికి మించిన సినిమాలు ఆశిస్తున్నారు. దీంతో ప్రభాస్ అందరిలా, అంతకు ముందులా మాములు కమర్షియల్, లవ్ సినిమాలు చేయలేకపోతున్నాడు. తన నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా భారీ బడ్జెట్ తోనే ఉంటుంది. దానితో పాటు తన మార్కెట్ కూడా పెంచుకుంటూ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లాలని చూస్తున్నాడు.

బాహుబలి తర్వాత 350 కోట్లు పెట్టి 'సాహో' సినిమా చేసాడు. ఈ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా బాలీవుడ్లో మాత్రం భారీ విజయం, భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ లో పాగా వేసేశాడు. ఈ సినిమా మొత్తం మీదా 450 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు రాబోయే 'రాధేశ్యామ్' సినిమా కూడా లవ్ మూవీ అయినా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.

ఇటీవలే మరో రెండు సినిమాలు కూడా అనౌన్స్ చేసాడు ప్రభాస్. అందులో ఒకటి 'మహానటి' సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై చేయబోతున్నాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని సమాచారం. ఈ సినిమాకి బడ్జెట్ 400 కోట్లకు పైగా పెడుతున్నారు. ఇందులో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ కోసం తన సినిమాలలో బాలీవుడ్ స్టార్స్ ని కూడా తీసుకుంటున్నాడు.

ఇటీవలే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తో 'ఆదిపురుష్' అనే సినిమాని అనౌన్స్ చేసాడు ప్రభాస్. ఈ సినిమా రామాయణం కథ ఆధారంగా ఉండబోతుంది. ఈ సినిమాని 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమాగా నిర్మించి రిలీజ్ చేస్తారు. ఇందులో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికీ చాలా అంచనాలను పెంచుతుంది. ఇలా ప్రభాస్ తన తర్వాత సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభాస్ దాదాపు 1000 కోట్ల సినిమాలను తన భుజాలపై మోస్తున్నాడు. టాలీవుడ్ నుంచి ఈ రేంజ్ కి ఎదిగింది ప్రభాస్ ఒక్కడే.. కానీ చాలా మందికి ప్రభాస్ నుంచి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి కూల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిస్ అయిపోతున్నామని బాధగా ఉన్నా, మరో పక్క తమ హీరో హాలీవుడ్ స్థాయికి ఎదుగుతున్నాడని ఆనందం కూడా ఉంది.                            

 

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్

   12 minutes ago


రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'

రేపిస్టులను పబ్లిక్ లో కాల్చి చంపాల్సిందే..'కంగనారనౌత్'

   an hour ago


స్టన్నింగ్ లుక్ లో అక్షరగౌడ..బికినీ ట్రీట్ అదుర్స్

స్టన్నింగ్ లుక్ లో అక్షరగౌడ..బికినీ ట్రీట్ అదుర్స్

   an hour ago


ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్.. జక్నన్నా.. ఇది నిజమేనా..?

   2 hours ago


అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?

అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?

   2 hours ago


ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?

ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?

   2 hours ago


మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా  ప్లాస్మా దానం..

మరోసారి మెగాస్టార్ మంచి మనసు.. ఉచితంగా ప్లాస్మా దానం..

   3 hours ago


మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..

మా నాన్నగారే లేనప్పుడు 'భారతరత్న' ఎందుకు?? ఎస్పీ బాలు కుమారుడు..

   3 hours ago


కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..

కరోనా దెబ్బకి కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ డైరెక్టర్..

   4 hours ago


అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..

అవతార్ 2,3 వచ్చేస్తున్నాయి..

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle