newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

'ప్రతిరోజూ పండగే' థియేట్రికల్ ట్రైలర్.. భావోద్వేగ‌ ప్రయాణం

05-12-201905-12-2019 08:21:40 IST
2019-12-05T02:51:40.745Z05-12-2019 2019-12-05T02:51:12.360Z - - 07-12-2021

'ప్రతిరోజూ పండగే' థియేట్రికల్ ట్రైలర్.. భావోద్వేగ‌ ప్రయాణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'చిత్రలహరి' ఇచ్చిన మంచి హిట్ తో జోష్ లో ఉన్న సాయిథరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. సత్యరాజ్, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మారుతీ దర్శకుడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ తో దర్శకుడు మారుతీ మరోమారు తన మేజిక్ చూపాడు.

సీరియస్ కథలను కామెడీతో లైటర్ వే చెప్పడంలో సిద్ధహస్తుడైన మారుతీ ఈ ట్రైలర్ లో మొత్తం కథని చెబుతూ ఎండింగ్ మాత్రం ఆసక్తి కలిగేలా కట్ చేశాడు. కాన్సర్ అడ్వాన్స్ స్టేజి లో ఉండటంతో మహా అయితే ఐదు వారాలు బతికే తాతగా సత్యరాజ్ పరిచయంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది.

విదేశాల్లో ఉన్న ఆయన తనయులు " ఇండియాకి వెళితే కష్టం. తన తండ్రి చనిపోతే ఎవరు కర్మ చేయాలి?" అంటూ డిస్కస్ చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను మారుతీ ఈ ట్రైలర్ తో కనెక్ట్ చేశాడు. ‘మారే కాలంతో పాటు మ‌నం కూడా మారాలి. వ‌య‌సుతో పాటు ఆశ‌లు కూడా చ‌చ్చిపోవాలి’ అంటూ సత్యరాజ్ పడే వేదనతో మనం కూడా కనక్ట్ అవుతాం.

సత్యరాజ్ కోసం ఎవరూ రాకపోయినా ఆయన మనవడు సాయి ధరమ్ తేజ్ విదేశాల నుండి ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుండి మారుతీ తన లోని ఫన్ కోణాన్ని జోడించాడు. జీవితంలో ఏవేవి చేయాలనీ అనుకున్నారో అన్నీ సత్యరాజ్ తో సాయి తేజ్ చేయించడం హైలైట్ గా నిలిచింది. 

తన తాత ప్రేమ వ్యవహారం కోసం ఆయన లవర్ (ప్రభ)ను సాయి తేజ్ తీసుకురావడం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. సత్యరాజ్ హృదయంపై ప్రభ చేయి వేయగానే అందుకు ఆయన ఇచ్చిన ఫేస్ ఫీలింగ్ కు నవ్వు రాకమానదు. 'టిక్ టాక్' స్టార్ గా రాశి ఖన్నా ఈ సినిమాలో నటించారు. 'నాకొద్దు నాకు నాకు నాకొద్దు' అంటూ వైరల్ అయినా టిక్ టాక్ వీడియోని ఆమె చేస్తున్నట్టు చూపడంతో కామెడీ యాంగిల్ స్టార్ట్ అయింది.

మరదలు రాశితో సాయి తేజ్ కామెడీ, రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఉంది. పెళ్లి పీటల మీద సాయి తేజ-రాశి ఖన్నా లు ఉండటం ఆ పెళ్ళికి విదేశాల నుండి కుటుంబ సభ్యులు రావడం వారందరితో సత్యరాజ్ హ్యాపీగా ఉండటం విజువల్ గా సూపర్ రెస్పాన్స్ పట్టేసింది. ట్రైలర్ చివర్లో రావు రమేష్ " మీకు నిజం గానే కాన్సర్ ఉందా? లేక శతమానం భవతి సినిమాలో ప్రకాష్ రాజ్ వేసిన బిస్కట్ లాగే మాకు కూడా బిస్కట్ వేశారా?" అంటూ సత్యరాజ్ ను అడగటం దర్శకుడి మారుతీ తెలివికి నిదర్శనం.

ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే 2017 సంక్రాంతికి వచ్చిన 'శతమానం భవతి' సినిమా అందరికి గుర్తుకొస్తుంది. ఆ సినిమా కాపీ అంటారనేమో గానీ దర్శకుడు మారుతీ చాలా తెలివిగా రావు రమేష్ తో 'శతమానం భవతి' డైలాగ్ చెప్పించాడు. మొత్తం మీద ట్రైలర్ తో ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ పెరిగిపోయింది.

థమన్ సంగీతంలో వచ్చిన పాటలు మంచి రెస్పాన్స్ పట్టేయగా తాజాగా వచ్చిన ట్రైలర్ సూపర్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ 1లో ఉండటం విశేషం.  గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. 

 

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

గొప్ప మనసు చాటుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఏపీ కి రూ. కోటి విరాళం

   2 hours ago


వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

వరుస ప్లాపుల నుంచి దిల్ రాజును కాపాడిన బాలయ్య అఖండ

   5 hours ago


ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

ఆర్ఆర్ఆర్ ని తలదన్నేలా అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్

   7 hours ago


ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్  ట్రైలర్ విడుదల

ఊర మాస్ గా అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్ ట్రైలర్ విడుదల

   8 hours ago


ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

   9 hours ago


సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

సంచలనం సృష్టిస్తున్న బాలయ్య అఖండ మూవీ కలెక్షన్స్

   a day ago


ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ అధికారిక విడుదల తేదీ వెల్లడి

   06-12-2021


అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle