newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

పోలీసాఫీసర్ పాత్రలో సూపర్ స్టార్

12-06-201912-06-2019 12:29:14 IST
Updated On 12-06-2019 12:30:06 ISTUpdated On 12-06-20192019-06-12T06:59:14.177Z12-06-2019 2019-06-12T06:59:12.170Z - 2019-06-12T07:00:06.121Z - 12-06-2019

 పోలీసాఫీసర్ పాత్రలో సూపర్ స్టార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 66 ఏళ్ళ వయసులోనూ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం 'పేట'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత మురుగదాస్ చెప్పిన కథని ఓకే చేశారు. 'దర్బార్' పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దాదాపు 28 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనబడనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం...రజినీ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే నయనతార-రజినీ కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో 'దర్బార్' సినిమాపై కూడా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో నివేతా థామస్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. నివేతా పాత్ర సినిమాను మలుపు తిప్పేలా ఉంటుందని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సునీల్ శెట్టి, బోమన్ ఇరానీ, ప్రతీక్ బబ్బర్, దిలీప్ తాహిర్ ముఖ్యమైన పాత్రలో నటించారు. 

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని వేగవంతంగా జరిపి ఆగస్టులోనే పూర్తి చేస్తామని దర్శకుడు మురుగదాస్ ప్రకటించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను 2020 జనవరి 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle