newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

పవన్ మూవీకి మళ్లీ చిక్కుముడులు.. ఏంటో తెలుసా?

29-06-202029-06-2020 12:44:06 IST
Updated On 29-06-2020 16:23:34 ISTUpdated On 29-06-20202020-06-29T07:14:06.872Z29-06-2020 2020-06-29T07:09:59.040Z - 2020-06-29T10:53:34.586Z - 29-06-2020

పవన్ మూవీకి మళ్లీ చిక్కుముడులు.. ఏంటో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే మధ్యలో గ్యాప్ తీసుకుని సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ముహూర్తాన పవన్ సినిమాలు ప్రారంభం అయ్యాయో గానీ వరుస అడ్డంకులు చికాకుపెడుతున్నాయి. పవన్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి అనేక చిక్కుముడులు ఏర్పడినట్టు తెలుస్తోంది. 

https://www.photojoiner.net/image/z84wiu49

 ‘వ‌కీల్‌సాబ్‌’ మూవీకి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్ ప్రారంభం అయినా వకీల్ సాబ్ కి మాత్రం  ప‌రిస్థితులు అనుకూలించినట్టులేదు.

ఆగ‌స్ట్‌లో సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుందని భావిస్తున్నారు. క‌రోనాకి తోడు ఈ సినిమాను లీకుల స‌మ‌స్య కూడా వేధిస్తోంది. సినిమా స్టార్టింగ్ రోజునే ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ లీక్ అయింది. తాజాగా ఇప్పుడు మ‌రో షూటింగ్ లొకేష‌న్ ఫొటో లీకైంది. సినిమాలో కీల‌క‌మైన  కోర్ట్ సీన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో ప‌వ‌న్‌క‌ల్యాణ్, అంజ‌లి కనిపిస్తారు. ఈ లీకులపై నిర్మాత‌లు బోనీక‌పూర్‌, దిల్‌రాజు చాలా సీరియస్ అవుతున్నారు. షూటింగ్ లొకేషన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle