newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

పవన్ ఫ్యాన్స్ హ్యాపీ.. పింక్ రీమేక్ షూటింగ్ షురూ..

21-01-202021-01-2020 13:41:14 IST
Updated On 21-01-2020 13:41:07 ISTUpdated On 21-01-20202020-01-21T08:11:14.728Z21-01-2020 2020-01-21T08:10:41.190Z - 2020-01-21T08:11:07.893Z - 21-01-2020

పవన్ ఫ్యాన్స్ హ్యాపీ.. పింక్ రీమేక్ షూటింగ్ షురూ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల్లో బిజీగా వున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత ఏ సినిమా చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్.

ఆ ఎన్నికల్లో తాను పోటీచేసిన రెండు స్థానాలతో పాటు పార్టీ ఒక్కసీటులో తప్ప అన్నిచోట్ల ఓడిపోయినప్పటికి ప్రజల తరపున ప్రభుత్వం పై పోరాడుతూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. రాజకీయాలతో పాటు పవన్ మళ్లీ సినిమాల బాట పట్టారు. పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి. 

బాలీవుడ్ లో హిట్ మూవీ 'పింక్' ని పవన్ తెలుగు రీమెక్ చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. పవన్ తో పాటు నివేథా థామస్, అంజలి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పవన్ కి 26 వ చిత్రం. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీకి సెన్సేషనల్ సంగీత దర్శకుడు తమన్ పనిచేస్తున్నాడు.ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే 23న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, భారీ పారితోషకం తీసుకుంటున్నారు.

ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేశాడు. వీటిపై కూడా క్లారిటీ రావాల్సి వుంది. లాయర్ సాబ్ మూవీకి సంబంధించి షూటింగ్ వెళుతున్న పవన్ ఫోటోని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle