newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

న్యూ లుక్ లో డార్లింగ్ సర్ప్రైజ్..!

16-09-202016-09-2020 13:28:25 IST
2020-09-16T07:58:25.915Z16-09-2020 2020-09-16T07:58:23.914Z - - 01-10-2020

న్యూ లుక్ లో డార్లింగ్ సర్ప్రైజ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ దర్శఖుడు రాజమౌళి తెరకెక్కించిన  బాహుబలి చిత్రంతో  పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  ప్రతీ సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు యంగ్ రెబల్ స్టార్. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాకు తగ్గట్టు లుక్ లో వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన డార్లింగ్.. బయటకు వచ్చిన ప్రతిసారి న్యూ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో లేటెస్టుగా సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చి మరోసారి అభిమానులకు కిక్ ఇచ్చాడు ప్రభాస్.

ట్రెండీ డ్రెస్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కింద కూర్చొని డార్లింగ్ ఇచ్చిన పోజ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకేముంది ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ షూట్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రభాస్ పెదనాన్న..సీనియర్ నటులు  కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో  పెట్టాడు.

'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ చేయనున్నాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇక 'ఆదిపురుష్' అనే స్ట్రెయిట్ హిందీ మూవీలో ప్రభాస్ నటించనుండటం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తారు.ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఆదిపురుష్ ఒకటి. 

ఆదిపురుష్ చిత్రం లో ప్రభాస్ రోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దశాబ్దాల క్రితం నాటి కథ తో ఓం రౌత్ ఈ కథను తెరకెక్కించేందుకు సిద్ధం కాగా, రాముడు గా ప్రభాస్, రావణాసురుడు గా సైఫ్ అలీఖాన్ లు కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చంశనీయం అయింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్,  సింగర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అయితే సినిమా ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇంకా సంప్రదింపు జరిపే ఆలోచనలో ఉండగా, ఇంకా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

 

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య గొడవలా..?

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య గొడవలా..?

   2 hours ago


రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

రాజ్ తరుణ్ - హేబ్బా పటేల్ లవ్ లో ఉన్నారా..?

   3 hours ago


నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

   5 hours ago


యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. ఎవరితో తెలుసా..?

   5 hours ago


క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

క్యాబ్ డ్రైవర్ ని మోసం చేసిన ముమైత్ ఖాన్..

   6 hours ago


బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

   6 hours ago


మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

మొగలిరేకులు సీరియల్ ఆర్కే నాయుడు హీరోగా సినిమా..

   6 hours ago


ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్ కి గట్టిగా సమాధానం చెప్పిన పునర్నవి..

   7 hours ago


పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

పవన్ ఫ్యాన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యాను.. దేవి నాగవల్లి

   7 hours ago


వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

వరదల్లో కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాతగారి ఇల్లు..

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle