newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

నేను అలాంటి దాన్ని కాదు.. సమంత కామెంట్స్

13-02-202013-02-2020 09:20:58 IST
Updated On 13-02-2020 16:36:44 ISTUpdated On 13-02-20202020-02-13T03:50:58.905Z13-02-2020 2020-02-13T03:41:33.010Z - 2020-02-13T11:06:44.184Z - 13-02-2020

నేను అలాంటి దాన్ని కాదు.. సమంత కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమాల్లోకి వచ్చాక అన్నీ లైట్ తీసుకోవాలంటోంది అక్కినేని వారి కోడలు సమంత. తాజాగా శర్వానంద్-సమంత కలిసి నటించిన చిత్రం జాను. ఈ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.ఎంతోమంది ప్రేమికులు ఈ మూవీకి కనెక్ట్ అవుతున్నారు. తాజాగా సమంత తిరుమల నడక దారిన వెళ్లి స్వామివారిని దర్శించుకుంది.

సినిమాలో నటించడం వరకే అవి సక్సెస్ అయితే సంతోషిస్తాం.. కలెక్షన్లు సరిగా రానంత మాత్రాన సినిమా బాగాలేదని అర్థం కాదంటోంది సమంత. తనకు నిరాశ చెందడం ఇష్టం ఉండదని సమంత అంటోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ రీమేక్‌గా జాను వచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో మొదటిసారిగా శర్వానంద్ సరసన నటించింది సమంత. కాగా ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. అయితే కలెక్షన్లలో మాత్రం అంత సంతృప్తికరంగా లేవంటున్నారు. ఈ మూవీలో నటించడానికి గల కారణాలను సమంత వివరించింది. 

తమిళంలో హిట్ అయిన మూవీ కాబట్గి చాలా ఛాలెంజ్‌గా భావించి ఒప్పుకున్నానని పేర్కొంది. తాను నటించిన అన్ని చిత్రాలు హిట్టు అవ్వాలని కోరుకుంటానని సమంత చెప్పుకొచ్చింది. సమంత అక్కినేని తదుపరి నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి. వెబ్ సిరీస్ లపై సమంత కన్నేసింది.

ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో ఆమె నెగిటివ్ పాత్రలో నటించగా.. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది. కథను బట్టి తాను సినిమాలు ఒప్పుకుంటానంటోంది సమంత. సినిమా ప్రమోషన్ల కోసం సమంత శారీలో తీసిన ఫోటో షూట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందానికి నిలువెత్తు నిదర్శనంగా వుందని కామెంట్లు పడుతున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle